Pakistan: 11మంది సోదరులు, 4 సోదరీమణులు.. ఈ పాకిస్తానీ ఆటగాడి సోదరులు ఒక క్రికెట్ జట్టు సుమా..
పాకిస్థాన్ క్రికట్ జట్టులో సంచలనం సృష్టిస్తున్నాడు కమ్రాన్ గులామ్. అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రస్తుతం క్రికెట్ ప్రియులను ఆకట్టుకున్నాడు. అయితే అతనికే కాదు అతని కుటుంబానికి కూడా క్రికెట్‌తో అనుబంధం ఉంది. కమ్రాన్ గులామ్ కు 11 మంది సోదరులు, ఆరుగురు సోదరీమణులు ఉన్నారు. కమ్రాన్ గులామ్ 11 మంది సోదరుల్లో ఆరుగురు క్లబ్ క్రికెట్ లో ఆడారు.
పాకిస్థాన్ క్రికెట్‌లో తన బ్యాటింగ్ తో సంచలనం సృష్టిస్తున్న కమ్రాన్ గులామ్ 2023లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కాగా 2024లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. పాకిస్థాన్ తరఫున 11 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన కమ్రాన్, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే యాభై పరుగులు చేసి.. మరోసారి వెలుగులోకి వచ్చాడు. దీంతో ఇప్పుడు కమ్రాన్ గులామ్ క్రికెట్ కెరీర్ తో పాటు అతని కుటుంబ నేపథ్యం కూడా తెరపైకి వచ్చింది. ఎందుకంటే కమ్రాన్ గులామ్ ఇంట్లోనే క్రికెట్ జట్టు ఉంది. అంటే కమ్రాన్ గులామ్ కు 11 మంది సోదరులు, నలుగురు సోదరీమణులున్నారు.
కమ్రాన్ గులామ్ ఫ్యామిలీలో మొత్తం 16 మంది సోదర సోదరీమణులు
కమ్రాన్ గులామ్ 10 అక్టోబర్ 1995న పాకిస్తాన్‌లోని అప్పర్ దిర్ జిల్లాలో జన్మించాడు. కమ్రాన్ గులామ్ ఈ ఏడాది పాకిస్తాన్ తరపున అడుగుతూ ఆస్ట్రేలియాలో పర్యటించాడు. ఈ సందర్భంగా జరిగిన మ్యాచ్‌లో గులామ్ బ్యాటింగ్ చేస్తుండగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ.. కమ్రాన్ గులాం ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. ఇతను 12 మంది సోదరులలో 11వవాడు. అంతేకాదు ఇతనికి నలుగురు సోదరీమణులు కూడా ఉన్నారని చెప్పాడు.
క్లబ్ క్రికెట్ ఆడిన ఆరుగురు సోదరులు
12 మంది సోదరులలో కమ్రాన్ గులాం 11వ వ్యక్తి. కమ్రాన్ గులామ్ ఒక్కడు మాతరమే క్రికట్ ఆటతో అనుబంధం ఉన్న వ్యక్తి కాదని.. కమ్రాన్ తో పాటు అతని 11 మంది సోదరులలో 6 మంది సోదరులు కూడా క్లబ్ క్రికెట్‌లో ఆడినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం కమ్రాన్ గులామ్ 6 సోదరులు ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని తమ స్వగ్రామంలో క్లబ్ క్రికెట్ కు ఆడారు.
కమ్రాన్ గులామ్ క్రికెట్ కెరీర్
కమ్రాన్ గులామ్ ఇప్పటివరకు పాకిస్థాన్ తరఫున ఏ టీ20 మ్యాచ్ ఆడలేదు. రెండు టెస్టులు ఆడిన అతను ప్రస్తుతం పాకిస్థాన్ వన్డే జట్టులో ఆడుతున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు గులామ్ రెండో టెస్టులో మూడు ఇన్నింగ్స్‌ల్లో 147 పరుగులు చేశాడు. ఇప్పటికే ఒక సెంచరీ నమోదైంది. 9 వన్డేల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 192 పరుగులు చేశాడు. 2023లో వన్డే కెరీర్‌ను ప్రారంభించిన గులామ్ ఈ ఫార్మాట్‌లోనూ సెంచరీ సాధించాడు. 61 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 17 సెంచరీలు, 49 కంటే ఎక్కువ సగటుతో 4524 పరుగులు చేశాడు.అంతేకాదు కమ్రాన్ గులామ్ 102 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 3536 పరుగులు చేశాడు. కమ్రాన్ గులామ్ 42 కంటే ఎక్కువ సగటుతో 9 సెంచరీలు చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..