జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న మీనాక్షి.. చేతినిండా సినిమాలతో బిజీ బిజీ 

Rajeev 

20 December 2024

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వినిపిస్తున్న పేరు మీనాక్షి చౌదరి. క్రేజీ ఆఫర్స్ తో టాలీవుడ్లో దూసుకుపోతుంది ఈ భామ. 

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఆతర్వాత మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది

తర్వాత హిట్ 2 సినిమాతో హిట్ అందుకుంది. ఇలా కెరీర్ లో ఒకొక్క మెట్టు ఎక్కుతూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది మీనాక్షి.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది. దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలో చేసింది మీనాక్షి.

ఇక ఇప్పుడు ఈ అమ్మడు వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం ఈ చిన్నదానికి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తుంది మీనాక్షి.