అందాల భామ రాశీ ఖన్నా ఇక టాలీవుడ్‌కు దూరంకానుందా..? 

Rajeev 

20 December 2024

సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన హీరోయిన్ అందమా భామ రాశి ఖన్నా.

2013లో విడుదలైన తెలుగులో ఊహలు గుస గుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తొలి సినిమాతోనే ఆడియన్స్ ను కవ్వించింది. 

రాశీ ఖన్నా.. 1990లో ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు అసలు నటనపై అంతగా ఆసక్తి లేదు.

కానీ ఊహించని విధంగా ఈ చిన్నది హీరోయిన్ గా మారింది. 2013లో షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం "మద్రాస్ కేఫ్"లో చేసింది. 

తెలుగులో పలు సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చాలా సూపర్ హిట్స్ లో నటించింది. 

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో స్పీడ్ తగ్గించింది. అలాగని ఇతర భాషల్లోనూ సినిమాలు పెద్దగా చేయడం లేదు. 

కానీ సోషల్ మీడియాలో అందాలతో అరాచకం చేస్తుంది. దాంతో ఈ అమ్మడు హిందీ మీద దృష్టి పెడుతుంది అందుకే గ్లామర్ డోస్ పెంచేస్తుంది అని అంటున్నారు కొందరు.