OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీ 9.2 రేటింగ్.. ఒంటరిగా మాత్రం చూడద్దు

|

Mar 29, 2025 | 7:01 PM

ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు మరో హారర్ థ్రిల్లర్ సినిమా వచ్చేసింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను బాగా భయ పెట్టింది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లనే రాబట్టింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీ 9.2 రేటింగ్.. ఒంటరిగా మాత్రం చూడద్దు
OTT Movie
Follow us on

వారాంతం వచ్చిందంటే, సినీ ప్రేమికులు OTTలో మంచి సినిమా కోసం వెతుకుతారు. ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు ఉన్నాయో సెర్చ్ చేస్తారు. అలాగే టాప్ రేటింగ్ మూవీస్ కోసం కూడా గాలిస్తారు. అలా ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అందులో ఈ సినిమా కూడా ఒకటి. ఇది హారర్, థ్రిల్లర్ అండ్ కామెడీ జానర్ మూవీ. థియేటర్లలో ఆడియెన్స్ కు థ్రిల్ కు గురిచేసిన ఈ మూవీకి ఐఎండీబీ 9.2 రేటింగ్ ఇవ్వడం విశేషం. అదే కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ ఛూ మంతర్. శరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అదితి ప్రభుదేవా, మేఘన గావ్ంకర్, ప్రభు ముండ్కర్, రజని భరద్వాజ్, విజయ్ చెల్లూర్, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు గురు కిరణ్ కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపిస్తారు. ఇది ది కేవలం హారర్ సినిమా కాదు. థ్రిల్లింగ్, కామెడీ అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ ను థ్రిల్ కు గురి చేస్తాయి.

ఇప్పుడీ ఛూ మంతర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతం సినిమా కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఓటీటీ ఆడియెన్స్ కోసం ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. మరికొన్ని రోజులు ఆగితే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

ఛూమంతర్ సినిమా ఒక పాడు బడిన బంగ్లా చుట్టూ తిరుగుతుంది. దీని గురించి అక్కడున్న ప్రజలు ఏవేవే కథలు భయంకరంగా చెప్పుకుంటారు. అలాంటి బంగ్లాలోకి ఓ ఫ్యామిలీ నివసించడానికి వెళ్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ మహల్ లో ఏముంది? అన్నది తెలుసుకోవాలంటే ఛూ మంతర్ సినిమా చూడాల్సిందే. హారర్ అండ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ మూవీ వీకెండ్ లో మంచి టైమ్ పాస్ అని చెప్పవచ్చు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.