Cinema: దిమాక్ కరాబ్ మామ.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ.. దుమ్మురేపుతోందిగా..

మలయాళీ చిత్రాలకు ఈమధ్యకాలంలో మంచి క్రేజ్ ఉంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న చిన్న సినిమాలు అటు థియేటర్లు, ఇటు ఓటీటీలలో దూసుకుపోతున్నాయి. తాజాగా మనం మాట్లాడుకుంటున్న ఓ థ్రిల్లర్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. స్నేహం, శత్రుత్వం, రాజకీయాల ఉత్కంఠభరితమైన కథను అందిస్తుంది.

Cinema: దిమాక్ కరాబ్ మామ.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ.. దుమ్మురేపుతోందిగా..
Meesha

Updated on: Sep 13, 2025 | 8:07 PM

ప్రస్తుతం మలయాళం, ఇతర భాష చిత్రాలు థియేటర్లలో సత్తా చాటుతున్నాయి. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలైన మూవీస్ ఇప్పుడు దూసుకుపోతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే క్రేజ్ ఇప్పుడు థియేటర్లకే పరిమితం కాలేదు. ఓటీటీల్లో నిత్యం సరికొత్త కంటెంట్ చిత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రతి వారం, ప్రేక్షకులకు కొత్త కంటెంట్ చిత్రాలను అందిస్తున్నాయి. ఇక అడియన్స్ చాలా రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళీ సినిమా మీషా ఇప్పుడు అధికారికంగా ఓటీటీలోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..

మీషా 9.4 అద్భుతమైన IMDb రేటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. MC జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కతిర్, షైన్ టామ్ చాకో, సుధీ కొప్ప వంటి తారలు ప్రధాన పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్ తో రూపొందిన మీషా చిత్రం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..

యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందినప్పటికీ, ఈ చిత్రం చాలా లోతుగా సాగుతుంది. స్నేహం, అసూయ, రాజకీయాల గురించి తెలియజేస్తుంది. స్నేహితుల మధ్య పోటీ, పరిష్కారం కాని భావోద్వేగాలు సంబంధాల పునాదిని ఎలా కదిలిస్తాయో ఈ కథ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?