Telugu Indian Idol 4: జెనీలియా ఎపిసోడ్ వచ్చేసింది.. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో టాప్ 12.. ఎవరంటే..
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా... ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్, గేమ్ షో, టాక్ షోలతో జనాలను ఆకట్టుకుంటుంది. అలాగే సింగింగ్ టాలెంట్ ఉండి నిరూపించుకోవడానికి ఎదురుచూస్తున్న గాయనీగాయకుల కోసం తెలుగు ఇండియన్ ఐడల్ షో ద్వారా అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది.

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ సినీప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కంటెంట్ తీసుకువస్తుంది. సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ వెబ్ సిరీస్, అదిరిపోయే గేమ్ షోలను అందిస్తుంది. సింగింగ్ టాలెంట్ ఉన్న గాయనీగాయకులకు అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు తెలుగు డిజిటల్ ప్రపంచంలో మొదటిసారి తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో సింగింగ్ షోను తీసుకువచ్చింది. ఇప్పటివరకు ఈ షో మూడు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. మొదటి నుంచి ఈ షోకు ఎంతో మంది కంటెస్టెంట్స్ వచ్చి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ వచ్చేసింది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా.. తాజాగా మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ వచ్చేసింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..
తెలుగులో అతి పెద్ద సింగింగ్ షో ఆహా ఓటీటీ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఇప్పుడు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో జనాలను ఆకట్టుకునేందుకు హాసిని అలియాస్ జెనీలియా అడుగుపెట్టింది. దీంతో ఈ ఎపిసోడ్ హైలెట్ అయ్యింది. ఈ షోకు సంగీత దర్శకులు తమన్, గాయకులు కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ప్రసారమవుతోంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
తాజాగా జెనీలియాకు సంబంధించిన ఎపిసోడ్ పార్ట్ 1 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు స్ట్రీమింగ్ అయ్యింది. ఇందులో టాప్ 12 కంటెస్టెంట్లను ఎంపిక చేసింది జెనీలియా. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల హిందీలో సితారే జమీన్ పర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే తెలుగు జూనియర్ మూవీతో చాలా కాలం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..




