Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaurya Paatham: ఓటీటీలో చౌర్య పాఠం నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్..

అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam). తాజాగా ఈ సినిమా ఓటీటీలో సరికొత్త సంచలనం సృష్టించింది. ఏకంగా 120 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మైలురాయిని అవలీలగా దాటేసి, డిజిటల్ వరల్డ్‌లో తనదైన ముద్ర వేసింది. థియేటర్లలో సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతూ, డిజిటల్ స్క్రీన్లను షేక్ చేస్తోంది.

Chaurya Paatham: ఓటీటీలో చౌర్య పాఠం నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్..
Chaurya Paatham
Rajitha Chanti
|

Updated on: Jun 21, 2025 | 10:11 PM

Share

స్టార్ల హంగామా లేదు, భారీ సెట్టింగుల ఆర్భాటం అంతకన్నా లేదు. అయినా ఈ సినిమా కథతోనే ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఇంతలా ప్రేక్షకాదరణ దక్కడానికి కారణం ఏంటంటే… కొత్త దర్శకుడు నిఖిల్ గొల్లమారి సాహసోపేతమైన దర్శకత్వం, కథలోని పచ్చి నిజాయితీ, నటీనటుల అద్భుతమైన సహజ నటన. ముఖ్యంగా, ఈ చిత్రంలో వేదాంత్ రామ్ పాత్రలో కనిపించిన ఇంద్ర రామ్, తొలి సినిమా అయినా అనుభవజ్ఞుడైన నటుడిలా అద్భుతంగా నటించారు..

తన మొదటి సినిమాను నిర్మించాలనే తీవ్రమైన ఆకాంక్షతో, నిధుల కోసం ధనపల్లి అనే గ్రామంలోని బ్యాంకును దోచుకోవడానికి ఒక చిన్న ముఠాతో కలిసి పథకం వేసే దర్శకుడిగా అతడి నటన ఆకట్టుకుంటుంది. పేరులో ‘చౌర్యం’ అని ఉన్నా, సినిమా చూశాక వచ్చే ఫీలింగ్ మాత్రం వేరే లెవెల్. దొంగతనం చుట్టూ తిరిగే కథే అయినా, నిజాయితీ, ధైర్యం, మానవ సంబంధాలలోని సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ, ప్రతి ఒక్కరి గుండెను తడుతుంది.

‘చౌర్య పాఠం’ కేవలం ఒక సినిమాగా మిగిలిపోకుండా, ఓటీటీ వేదికపై ఓ లైవ్ డిస్కషన్‌ పాయింట్‌గా మారింది. సింపుల్‌గా కనిపించే కథలో ఎమోషనల్ డెప్త్ చూపించడమే ఈ సినిమా స్పెషాలిటీ. నక్కిన నరేటివ్స్ బ్యానర్‌పై త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలై, అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. సంగీతం కూడా సినిమాకు ఒక ప్లస్ పాయింట్. ఇంకా చూడకపోతే దీన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూసేయొచ్చు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..