Swathimuthyam: అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే ఓటీటీలోకి స్వాతిముత్యం.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

కాగా ముందుగా అక్టోబర్‌ 28 నుంచి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. అయితే నాలుగు రోజులు ముందుగానే దీపావళి కానుకగా అక్టోబర్‌ 24 నుంచే స్వాతిముత్యం సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఆహా తెలిపింది.

Swathimuthyam: అనుకున్న టైమ్‌ కంటే ముందుగానే ఓటీటీలోకి స్వాతిముత్యం.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Swathimuthyam Movie

Updated on: Oct 24, 2022 | 1:39 PM

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ తనయుడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యంగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దసరాకు విడుదలైన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించింది. లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద క్లీన్‌ హిట్‌గా నిలిచింది. గాడ్‌ఫాదర్‌, ఘోస్ట్‌ల పోటీని తట్టుకుని మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సూపర్‌ హిట్ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా దీపావళి కానుకగా స్వాతిముత్యం సినిమాను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది ఆహా యాజమాన్యం. కాగా ముందుగా అక్టోబర్‌ 28 నుంచి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. అయితే నాలుగు రోజులు ముందుగానే దీపావళి కానుకగా అక్టోబర్‌ 24 నుంచే స్వాతిముత్యం సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ఆహా తెలిపింది.

ఇక స్వాతిముత్యం సినిమా కథ విషయానికొస్తే.. బాల మురళీ కృష్ణ అలియాస్‌ బాల (గణేశ్‌ బెల్లంకొండ) చుట్టూ తిరుగుతుంది. పసిపిల్లాడి లాంటి స్వచ్ఛమైన మనసున్న బాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తుంటాడు. అతని తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లిచేయాలని సంబంధాలు చూస్తుంటారు. అలా సంబంధం చూడడానికి వెళ్లిన అమ్మాయి భాగ్యలక్ష్మి అలియాస్‌  (వర్ష బొల్లమ్మ) తో ప్రేమలో పడిపోతాడు బాల. వారిద్దరికి పెళ్లి కుదురుతుంది. అయతే పెళ్లి రోజున బాలకి అనుకోకుండా మరో అమ్మాయి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తుంది. దీంతో అతను పూర్తిగా గందరగోళంలో పడిపోతాడు. పెళ్లి కూడా ఆగిపోతుంది. మరి బాల సమస్య ఏంటి? భాగ్యను పెళ్లి చేసుకున్నాడా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం అక్టోబర్‌ 24న ఆహాలో వచ్చే స్వాతిముత్యం సినిమాను చూడాల్సిందే. మంచి ట్విస్టులతో సాగే ఈ ఫ్యామిలీ డ్రామాలో సరోగసీ అనే పాయింట్‌ గురించి ప్రస్తావించారు. భావోద్వేగాలు, సున్నితమైన హాస్యంతో ఆద్యంతం ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి

Swathimuthyam

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.