OTT Movie: ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలోకి మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
కిష్కింద కాండం, సూక్ష్మ దర్శిని, రేఖా చిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ మలయాళ సినిమాలకు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ఎవరూ ఊహించని కథా కథనాలు, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టి పడేశాయి. ఈ కోవలోనే మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి రానుంది.

ఆడియెన్స్ కు థ్రిల్ ఇచ్చేందుకు మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఒకే సారి స్ట్రీమింగ్ కు రానుంది. ఇందులో ఉన్న హీరో మరెవరో కాదు మనందరికీ బాగా పరిచయస్తుడు, సూక్ష్మ దర్శిని సినిమాలో విలనిజం పండించిన బాసిల్ జోసెఫ్. అలాగే సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్ వంటి ప్రముఖ మలయాళ నటులు కూడా ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అన్నట్లు టాలీవుడ్ సీనియర్ నటి రేవతి ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడం విశేషం. సంక్రాంతి కానుకగా జనవరి 16న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో జనాలు ఈ సినిమాను బాగా ఆదరించారు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు లాభాల పంట పండించింది. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అదే ‘ప్రావింకూడు షాపు’. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 11 నుంచి సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ట్రైలర్ ను సోనీ లివ్ రిలీజ్ చేసింది.
ఆ మర్డర్ వెనక మిస్టరీ ఏంటీ?
కాగా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ ప్రావింకూడు షాపు సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ లో బాసిల్ జోసెఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ పాత్రను పోషించగా, సౌబిన్ మెజీషియన్ పాత్రలో అదరగొట్టాడు. అన్వర్ రషీద్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అన్వర్ రషీద్ ఈ సినిమాను నిర్మించారు. విష్ణు విజయ్ సంగీతం అందించారు. మంచి సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారికి ప్రావింకూడు షాపు ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
ప్రావింకూడు షాపు సినిమా ట్రైలర్..
A mystery too twisted, a ride too fun. Get ready for mystery and madness with Pravinkoodu Shappu streaming from April 11 on Sony LIV
Watch #PravinkooduShappu On Sony Liv From 11 April#PravinkooduShappuOnSonyLIV pic.twitter.com/3urUrZGcgx
— Sony LIV (@SonyLIV) April 1, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.