Bhagavanth Kesari OTT: ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి బాలయ్య ‘భగవంత్‌ కేసరి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన బాలయ్య బ్లాక్‌ బస్టర్‌ మూవీ భగవంత్‌ కేసరి మరికొన్ని గంటల్లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుంది. శుక్రవారం (నవంబర్‌ 24) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌లో ఈ దసరా బ్లాక్‌ బస్టర్‌ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరిలో ..

Bhagavanth Kesari OTT: ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి బాలయ్య 'భగవంత్‌ కేసరి'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Bhagavanth Kesari Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2023 | 3:57 PM

నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్‌ న్యూస్‌. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన బాలయ్య బ్లాక్‌ బస్టర్‌ మూవీ భగవంత్‌ కేసరి మరికొన్ని గంటల్లో డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుంది. శుక్రవారం (నవంబర్‌ 24) అర్ధరాత్రి నుంచే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌లో ఈ దసరా బ్లాక్‌ బస్టర్‌ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరిలో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. దసరా కానుగా అక్టోబర్‌ 19న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. 135 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు పేర్కొన్నారు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా భగవంత్‌ కేసరి నిలిచింది. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్‌ ఓ కీలకపాత్రలో కనిపించింది. ఇప్పటికీ థియేటర్లలో అలరిస్తోన్న భగవంత్ కేసరి ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ఆ మాస్‌ సాంగ్‌, అదనపు సీన్లతో కలిపి స్ట్రీమింగ్‌..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భగవంత్ కేసరి డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. నవంబర్‌ 23 లేదా నవంబర్‌ 25 నుంచి బాలయ్య సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే శుక్రవారం (నవంబర్‌ 24) నుంచే భగవంత్‌ కేసరిని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. భగవంత్‌ కేసరి సినిమాలో దంచవే మేనత్త కూతురా బిట్‌ సాంగ్‌ కూడా ఉంది. థియేటర్లలో దీనిని ప్రదర్శించలేదు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో మాత్రం ఆ సాంగ్‌ ఉండనుంది. దీనితో పాటు సెన్సార్ బోర్డ్ కట్ చేసిన కొన్ని డైలాగులును, సన్నివేశాలను కూడా ఇందులో చూపిస్తారని సమాచారం. భగవంత్‌ కేసరి సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ స్టైలిష్‌ విలన్‌గా నటించాడు. అలాగే శరత్‌ కుమార్‌, రవి శంకర్‌, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, జాన్‌ విజయ్‌, రాహుల్‌ రవి తదితరులు కీలక పాత్రల ఓనటించారు. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఎస్‌. థమన్‌ స్వరాలు అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్