Gam Gam Ganesha OTT: ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ.. ‘గం గం గణేశా’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే మే 31న విడుదలైన గం గం గణేశా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

Gam Gam Ganesha OTT: ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ.. 'గం గం గణేశా' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Gam Gam Ganesha Movie
Follow us

|

Updated on: Jun 15, 2024 | 9:15 PM

బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఇందులో ప్రేమలో విఫలమైన యువకుడిగా అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఈ యంగ్ హీరో నెక్ట్స్ ఎలాంటి సినిమా చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందుకు తగ్గట్టుగానే గం గం గణేశా అంటూ ఓ డిఫరెంట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు ఆనంద్ దేవరకొండ. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే మే 31న విడుదలైన గం గం గణేశా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీలో కొత్త దనం లేకపోయినా టేకింగ్ బాగుందని, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ సూపర్బ్‌గా ఉందని ప్రశంసలు వచ్చాయి. సినిమాలో కామెడీతోపాటు ట్విస్టులు అదిరిపోయాయని రివ్యూలు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఆలా ఆడియెన్స్ మెప్పు పొందిన గం గం గణేశా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని టాక్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 28న లేదా జులై మొదటి వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

గం గం గణేశా సినిమాకు ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. ఆయనకు ఇదే మొదటి సినిమా. హైలైఫ్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ లో కేదార్ సెలగంశెట్టితో కలిసి వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు. ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. నయన్ సారిక, సత్యం రాజేశ్, అర్జున్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య జవ్వాది కెమెరామెన్ గా వ్యవహరించగా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
అందాల పోటీల్లో ముందున్న ‘జారా’.. జారాది కళ్లు.. చెదిరే అందం.!
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
పేరుకు కేంద్ర మంత్రి.. ఒక్క పదం రాయడం రాదట! ఓ లెవెల్‌లో ట్రోలింగ్
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
ఎర్ర సముద్రంలో అరాచకం.. హౌతీ రెబెల్స్‌ మరో నౌకను ముంచేసారు.
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
రూ.10 వేలు పెట్టుబడి పెట్టి..రూ.10 కోట్లకు అధిపతులయ్యారు.!
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
షాకింగ్ ఘటన.. ఆలూ చిప్స్‌ ప్యాకెట్‌లో కుళ్లిన కప్ప.. వీడియో.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
స్నానానికి వెళ్లి బ్రెయిన్ ఈటింగ్‌ అమీబా వల్ల మృతి.
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
చేయి తెగి రక్తమోడుతున్నా పట్టించుకోలేదు.. చివరికి ఏమైందంటే.!
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే విమానంలో మంటలు..! వీడియో వైరల్..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..
చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక డెడ్ బాడీ..! వీడియో చూస్తే షాకే..