Ileana: భార్యభర్తల మధ్య ప్రేమికులు పెట్టిన చిచ్చు.. ఓటీటీలోకి వచ్చేసిన ఇలియానా బోల్డ్ రొమాంటిక్ మూవీ..

చాలా కాలం పాటు సైలెంట్ అయిన ఈ గోవా బ్యూటీ.. సడెన్ గా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి అభిమానులకు షాకిచ్చింది. బాబు పుట్టిన తర్వాతే భర్తను కూడా పరిచయం చేసింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ అంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇలియానా.. ఇటీవలే దో ఔర్ దో ప్యార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.

Ileana: భార్యభర్తల మధ్య ప్రేమికులు పెట్టిన చిచ్చు.. ఓటీటీలోకి వచ్చేసిన ఇలియానా బోల్డ్ రొమాంటిక్ మూవీ..
Do Aur Do Pyaar Movie
Follow us

|

Updated on: Jun 16, 2024 | 2:45 PM

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఇలియానా. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. మహేష్ బాబు జోడిగా పోకిరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా.. ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రేయేట్ చేసుకున్న ఈ భామ.. గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలం పాటు సైలెంట్ అయిన ఈ గోవా బ్యూటీ.. సడెన్ గా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి అభిమానులకు షాకిచ్చింది. బాబు పుట్టిన తర్వాతే భర్తను కూడా పరిచయం చేసింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ అంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇలియానా.. ఇటీవలే దో ఔర్ దో ప్యార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ విద్యా బాలన్, ప్రతిక్ గాంధీ ప్రధాన పాత్రలు పోషించారు.

రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా టాక్ బాగున్నా.. కమర్షియల్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాలో నోరా గా ఇలియానా బోల్డ్ రోల్ పోషించింది. రొమాంటిక్ డైలాగ్స్, గ్లామరస్ క్యారెక్టర్ లో ఇలియానా ఎప్పటికీ అదరగొట్టేసింది. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఇలియానాను గుర్తుచేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ అంతగా జరగకపోవడంతో జనాలకు ఈ సినిమా గురించి తెలియలేదు. అలాగే థియేటర్లలో రిలీజ్ అయిన విషయం కూడా ప్రేక్షకులకు తెలియలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన, హడావిడి లేకుండా ఈసినిమాను విడుదల చేశారు మేకర్స్.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. బెంగాళీ కుర్రాడు అనీ (ప్రతీక్ గాంధీ), తమిళ అమ్మాయి కావ్య (విద్యా బాలన్) ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. కానీ వీరిద్దరికి పెళ్లికి ముందే మరోకరితో ప్రేమ, డేటింగ్, రిలేషన్ షిప్ ఉంటుంది. పెళ్లి తర్వాత అపార్థాలు, అపోహల కారణంగా మనస్పర్థలు వస్తాయి. పెళ్లికి ముందే అనీ.. నోరా (ఇలియనా)తో ప్రేమలో ఉండగా.. కావ్య.. విక్రమ్ (సెంథిల్ రామమూర్తి)తో డేటింగ్ చేస్తుంది. ఈ బంధాలు అనీ, కావ్య జీవితాల్లో ఎలాంటి పరిస్థితులను తీసుకువచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరు ఎలా కలిశారు అన్నదే దో ఔర్ దో ప్యార్ మూవీ స్టోరీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles