సస్పెన్స్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ సినిమాలను చూడడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా పెద్ద ఎత్తున ఈ జోనర్ సినిమాలు, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తుంటాయి. అలా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ తాజాగా నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా పేరు అడ్డ తీగల. బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అర్జున్ కల్యాణ్, ప్రముఖ యూట్యూబర్ వాసంతి కృష్ణన్ ఈ మూవీలో జంటగా నటించారు. శ్రీ శృంఖలా దేవి ఫిలిమ్స్ బ్యాపర్‌పై రాధికా రామరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మీడియా గ్రాఫిక్స్ విభాగంలో విశేష అనుభవమున్న గాదిరాజు రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిజానికి చాలా రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది అయితే కొన్ని కారణాలతో రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు అడ్డతీగల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా డైరెక్టుగా ఓటీటీలోనే. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో శుక్రవారం (జూన్ 9) నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికొస్తే.. ఒక సాఫ్ట్ వేర్ జంట వీకెండ్ కోసం అడ్డతీగల , మారేడుమల్లి అటవీ ప్రాంతానికి వెళతారు. అక్కడ వాళ్లకు భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఓ సీరియల్ కిల్లర్ వారి వెంటపడతాడు. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? వీళ్ల వెంట ఎందుకు పడతాడు. చివరకు ఏమైంది అన్నది సస్పెన్స్. రోడ్ ట్రిప్, సీరియల్ కిల్లింగ్ వంటి ఆసక్తికరమైన అంశాలతో కూడిన అడ్డతీగల సినిమాపై ఇంట్లోనే కూర్చొని ఓ లుక్కేసుకోండి.
Telugu film #Addateegala (2023) now streaming on @ahavideoIN pic.twitter.com/J2bVRo3gOS
— Streaming Update by JORDAN (@ottjordan29) June 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..