Venkatesh: వెంకటేష్ బర్త్ డే స్పెషల్.. వెబ్ సిరీస్ నుంచి వెంకీ పోస్టర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్..
విక్టరీ వెంకటేష్.. ఇప్పటికీ కుర్రహీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలను చేస్తూ.. ఫుల్ జోష్
విక్టరీ వెంకటేష్.. ఇప్పటికీ కుర్రహీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలను చేస్తూ.. ఫుల్ జోష్ మీదున్నారు వెంకటేష్.. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో వరుసగా రీమేక్ చిత్రాలను చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవలే నారప్ప, దృశ్యం 2 వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు వెంకటేష్. ఈరోజు వెంకీమామ పుట్టినరోజు సందర్భంగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా.. వెంకీ తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్.. పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ నుంచి వెంకటేష్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. నెరిసిన జుట్టు, గడ్డం, చెవికి పోగుతో కనిపించిన వెంకీ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఒక పాస్ పోర్ట్ ఫోటో పట్టుకుని ఆచూకీ వెతుకుతున్న వ్యక్తిగా వెంకటేష్ కనిపించారు. అయితే ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ టైటిల్.. అందులో నటించే నటీనటులకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో దగ్గబాటి రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ట్వీ్ట్..
Inthaki emocchu?
Friends tho unna, family tho unna, ontariga unna Venky Mama cinemalu enjoy cheyadam vacchu. Any genre, any emotion, single name.
Happy Birthday @VenkyMama?? #HappyBirthdayVictoryVenkatesh pic.twitter.com/zkq0skPoi9
— Netflix India South (@Netflix_INSouth) December 13, 2021
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెంకటేష్.. ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, వీడియోలకు మంచి స్పందన వచ్చింది.
Also Read: Samantha: హీరోయిన్ సమంతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చికిత్స..
Rashmika Mandanna: ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానన్న నేషనల్ క్రష్ రష్మిక.. ఇంతకు ఏమైందంటే..
Miss Universe : ఇప్పటివరకు ఇండియా తరపున విశ్వ సుందరి పోటీలో పాల్గొన్న భామలు వీరే..