Bhuj Movie: ఓటీటీలోకి అజయ్ దేవ్‌గణ్ సినిమా.. ‘భుజ్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు వినోదాన్ని చెంతకు చేరుస్తున్న ఓటీటీలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. సూపర్ హిట్ సినిమాలతోపాటు.. వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
సినీ ప్రియులకు ఎప్పటికప్పుడు వినోదాన్ని చెంతకు చేరుస్తున్న ఓటీటీలకు ఆదరణ పెరుగుతూనే ఉంది. సూపర్ హిట్ సినిమాలతోపాటు.. వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ వారం రోజులకు సరికొత్త కంటెంట్‌తో కూడిన సూపర్ హిట్ చిత్రాలు విడుదలవుతుండగా.. తాజాగా మరో హిట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటించిన ‘భుజ్’ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధమైంది. ఇందులో అజయ్ దేవ్‌గణ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్‌గా నటించారు.
అయితే గతంలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా వెల్లడించిన తేదీని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఈ మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఓ ప్రత్యేకమైన వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు అజయ్ దేవ్‌గణ్. “1971లో జరిగిన గొప్ప యుద్ధం భుజ్గా ఆగస్టు 13న మీ ముందుకొస్తుందని” ట్వీట్ చేశారు. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన భుజ్ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ ఖేల్కర్, యమ్మీ, విర్క్ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. అభిషేక్ దుదయా దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
ట్వీట్..
1971. THE GREATEST BATTLE EVER FOUGHT.#BhujThePrideOfIndia releasing on 13th August only on @DisneyplusHSVIP.#DisneyPlusHotstarMultiplex@duttsanjay #SonakshiSinha @AmmyVirk #NoraFatehi @SharadK7 @pranitasubhash @ihanaofficial @AbhishekDudhai6 #BhushanKumar @TSeries pic.twitter.com/35WUFp5GK4
— Ajay Devgn (@ajaydevgn) July 6, 2021
Also Read: Case on Bhargavram: మొదటి కేసులో నుంచి ఇంకా బయటపడలేదు.. మళ్లీ ఇంకో కేసు నమోదు..!