OTT Movies: ఓటీటీలలో కాక రేపుతోన్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు.. హిట్‌లిస్టు ఇవే.!
ఎప్పుడూ కూడా సినీ ప్రియులు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడంలో ముందుంటారు. అదే మరోసారి రుజువైంది.
సినిమా థియేటర్ అయినా.. ఓటీటీ అయినా.. మంచి కంటెంట్ ఉంటే.. ఆ సినిమా దమ్ము చూపిస్తుందని చెప్పడానికి సీతారామం, కార్తికేయ 2, బింబిసార చిత్రాలే నిదర్శనం. ఎప్పుడూ కూడా సినీ ప్రియులు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడంలో ముందుంటారు. అదే మరోసారి రుజువైంది. ఇదిలా ఉంటే.. ఓటీటీలలో బడ్జెట్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం రిలీజైన వాటిల్లో కొన్ని ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. మరి ఆ హిట్‌లిస్టులో ఉన్నవి ఏంటో చూసేద్దాం పదండి..
1. తమిళ్ రాకర్స్(Tamil Rockerz)
మూవీ పైరసీ, డార్క్ వెబ్ అరాచకాల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘తమిళ్ రాకర్స్’. ఈ పేరు గురించి సినీ వర్గాల్లో వినని వారెవరూ ఉండరు. ఈ సిరీస్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అరుణ్ విజయ్, ఐశ్వర్య మీనన్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్ సోని లివ్(Sony Liv)లో స్ట్రీమింగ్ అవుతోంది.
2. దురంగ(Duranga)
కొరియన్ సిరీస్ ‘Flower of Evil’కు ఇండియన్ అడాప్షన్‌గా తెరకెక్కింది ‘దురంగ’. ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ సిరీస్‌లో గుల్షన్ దేవయ్య, ద్రష్టి దామి ప్రధాన పాత్రల్లో కనిపించారు. జీ5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
3. ది నెక్స్ట్ 365 డేస్(The Next 365 Days)
365 డేస్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా వచ్చిన చిత్రం ‘ది నెక్స్ట్ 365 డేస్’. 2020 లాక్‌డౌన్‌లో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘365 డేస్’. ఆ సినిమా హిట్ కావడంతో.. కేవలం 3 నెలల వ్యవధిలోనే నెట్‌ఫ్లిక్స్.. ఈ సినిమాకు రెండు సీక్వెల్స్ రిలీజ్ చేసింది. ‘Kolejne 365 Dni; by Blanka Lipińska నవల ఆధారంగా ఈ సినిమాలు తెరకెక్కాయి. తాజాగా విడుదలైన ది నెక్స్ట్ 365 డేస్ ఫర్వలేదనిపించగా.. దీనిని నెట్‌ఫ్లిక్స్‌లో మీరు చూడవచ్చు.
4. హెవెన్(Heaven)
సూరజ్ వెంజరమూడు, స్మిను సిజో, సుదేవ్ నాయర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హెవెన్’. ఈ మలయాళ చిత్రంలో మీకు కావలసినన్ని ట్విస్టులు ఉన్నాయి. ఓటీటీ ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. డిస్నీ+ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయింది.
5. హైవే(Highway)
ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో దర్శకుడు కెవి గుహన్ తెరకెక్కించిన చిత్రం ‘హైవే’. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది.
అలాగే, ది బిస్ బాస్, ది గర్ల్ ఇన్ ది మిరర్, కియో, గ్లో అప్, ది కప్ హెడ్ షో, ది అసిస్టెంట్, ద్విండిల్, ఎకోస్, యానై, జీవీ2, బైరాగి, మైనస్ వన్, కారాగార్ వెబ్ సిరీస్‌లు, చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం..