Oskar Sala: ఎలక్ట్రిక్‌ మ్యూజిక్‌ సృష్టికర్త ఆస్కార్‌ సాలా బర్త్‌డే నేడే! ఆర్కెస్ట్రా ఇలా పుట్టుకొచ్చిందా..

ఈ రోజు (జులై 18) గూగుల్ డూడుల్‌లో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? ఆయనెవరో కాదు ఎలక్ట్రిక్‌ మ్యూజిక్‌ సృష్టికర్త ఆస్కార్‌ సాలా. నేటి కాలంలో మ్యూజిక్‌ అంటే ఇష్టపడని వారుండరు. ఐతే పూర్వకాలం నుంచి పిల్లనగ్రోవి, తబల వంటి సంప్రదాయ సంగీత..

Oskar Sala: ఎలక్ట్రిక్‌ మ్యూజిక్‌ సృష్టికర్త ఆస్కార్‌ సాలా బర్త్‌డే నేడే! ఆర్కెస్ట్రా ఇలా పుట్టుకొచ్చిందా..
Oskar Sala
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2022 | 10:39 AM

Google celebrates Oskar Sala’s 112th Birthday: ఈ రోజు (జులై 18) గూగుల్ డూడుల్‌లో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టారా? ఆయనెవరో కాదు ఎలక్ట్రిక్‌ మ్యూజిక్‌ సృష్టికర్త ఆస్కార్‌ సాలా. నేటి కాలంలో మ్యూజిక్‌ అంటే ఇష్టపడని వారుండరు. ఐతే పూర్వకాలం నుంచి పిల్లనగ్రోవి, తబల వంటి సంప్రదాయ సంగీత పరికరాలకు అలవాటు పడిన మానవజాతికి ఎలక్ట్రిక్‌ మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లను అందించిన మహానుభావుడు ఆస్కార్‌ సాలా. జర్మన్‌ దేశానికి చెందిన ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ సృష్టికర్త ఆస్కార్‌ సాలా 112వ పుట్టిన రోజు నేడు. ఆయన జన్మదినం పురస్కరించుకుని గూగుల్‌ స్పెషల్‌ డూడుల్‌తో సెలబ్రేషన్‌ చేస్తోంది.

ఆస్కార్‌ సాలా 1910లో జర్మనీలోని గ్రీజ్ జన్మించాడు. ఇతడు భౌతిక శాస్త్రవేత్త. సాలా తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో విధ్వాంసులు. తల్లి గాయని, తండ్రి కంటి వైద్యుడు (ophthalmologist) అయినప్పటికీ సంగీతంలో దిట్ట. సంగీత కుటుంబ నేపథ్యమున్న సాలా 14వ యేట నుంచే వయోలిన్, పియానో ​​వంటి వాయిద్యాలపై కంపోజిషన్లు చేయడం, పాటలను సృష్టించడం ప్రారంభించాడు. మిక్సర్‌-ట్రౌటోనియం అనే ఇన్‌స్ట్రుమెంట్‌పై సౌండ్ ఎఫెక్ట్‌లను రూపొందించినందుకు ప్రపంచ వ్యప్తంగా ప్రశంశలందుకున్నాడు సాలా.

ఇవి కూడా చదవండి

చిన్నతనంలోనే ట్రాటోనియం అనే పరికరం గురించి తెలుసుకున్న సాలా, దీనికి కొంత సాంకేతికత జోడించి తన జీవితం కాలంలో మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై మక్కువతోనే పాఠశాల స్థాయి నుంచి ఫిజిక్స్‌ను ఇష్టపడి చదివేందుకు సాలాకు ప్రేరణ కలిగిందని గూగుల్‌ తెల్పింది. ఆ తర్వాత సాలా అనుకున్నట్లుగతానే స్వంతంగా మిక్చర్‌-ట్రాటోనియం పరికరాన్ని అభివృద్ధి పరిచాడు. దీనితోపాటు ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌ కూడా సాలా చేతితోనే సృష్టించబడింది. ఆ తర్వాత కాలంలో క్వార్టెట్-ట్రాటోనియం, కాన్సర్ట్ ట్రాటోనియం, వోక్స్‌ స్ట్రాటోనియంలను కూడా తయారుచేశాడు. తద్వారా సబ్‌హార్మోనిక్స్ ఫీల్డ్‌ను ప్రారంభించాడు.

రోజ్మేరీ (1959), ది బర్డ్స్ (1962) వంటి అనేక టెలివిజన్, రేడియో, మూవీ ప్రొడక్షన్లకు ఆస్కార్ సాలా సంగీతం, సౌండ్ ఎఫెక్ట్‌లను అందించాడు. సాలా రూపొందించిన మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ పక్షుల అరుపులు, సుత్తి, తలుపు శద్ధాలు, కిటికీల చప్పుడు వంటి సౌండ్‌ ఎఫెక్ట్‌లను అందించగలదు. 1995లో సాలా సృష్టించిన ఒరిజినల్‌ మిక్చర్‌- ట్రాటోనియంను జర్మన్ మ్యూజియంకు విరాళంగా అందించాడు. సాలా తన జీవిత కాలంలో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఎన్నో మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంకితభావం, క్రియేటివిటీతో ‘వన్-మ్యాన్ ఆర్కెస్ట్రా’గా చరిత్రలో సాలా పేరుగాంచాడు.