KRDCL Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గమనిక! కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో రూ.131700ల జీతంతో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ సంస్థ అయిన కేరళలోని తిరువనంతపురంలోనున్న రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ Kerala Rail Development Corporation Limited.. ఒప్పంద ప్రాతిపదికన సెక్షన్ ఇంజినీర్ పోస్టుల (Section Engineer Posts) భర్తీకి..

KRDCL Recruitment 2022: బీటెక్‌ నిరుద్యోగులకు గమనిక! కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో రూ.131700ల జీతంతో ఉద్యోగాలు..
K Rail
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 18, 2022 | 8:41 AM

KRDCL Thiruvananthapuram Section Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన కేరళలోని తిరువనంతపురంలోనున్న రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ Kerala Rail Development Corporation Limited.. ఒప్పంద ప్రాతిపదికన సెక్షన్ ఇంజినీర్ పోస్టుల (Section Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: సెక్షన్ ఇంజినీర్ పోస్టులు

వయోపరిమితి: డిసెంబర్‌ 31, 2021 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.46,250ల నుంచి రూ.1,31,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సివిల్‌ స్పెసలైజేషన్‌లో బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: మేనేజింగ్ డైరెక్టర్, కేఆర్‌డీసీఎల్‌, 5వ అంతస్తు, ట్రాన్స్ టవర్స్, తిరువనంతపురం

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 6, 2022 (నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.