Oscars- 2025: ప్రపంచమంతా ఆస్కార్ ఫీవర్.. అవార్డుల పండుగకు సర్వం సిద్ధం.. ఇండియన్ సినిమాలకు..?
గతంలో రాజమౌళి RRR మూవీలో నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన షార్ట్ ఫిల్మ్ అనూజ... నామినేషన్స్‌లో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ నామినేషన్స్‌లో నిలిచింది. భారత కాలమానం ప్రకారం మనదేశంలో మార్చి 3వ తేదీ ఉదయం 5:30 నిమిషాలకు ఈ వేడుక వీక్షించే అవకాశముంది.

ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ ఫీవర్ మొదలైంది. ఆస్కార్-2025కు అంతా సిద్ధమైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవార్డుల పండుగ… భారతీయ కాలమానం ప్రకారం మార్చి3 ఉదయం 5:30 గంటలకు జరగనుంది. ఈ వేడుక కోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక 97వ ఆస్కార్ నామినేషన్స్ జాబితా విడుదలైంది. పలు విభాగాల్లో పోటీపడుతున్న చిత్రాల లిస్ట్‌ను అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ప్రకటించారు. ఇక ఆస్కార్ 2025 వేడుకలు…లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి.
బెస్ట్ పిక్చర్ కేటగిరీలో అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్ అన్‌నోన్, కాన్‌క్లేవ్, డ్యూన్: పార్ట్2, ఎమిలియా పెరెజ్, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, వికెడ్ చిత్రాలు నామినేట్ అయ్యాయి. ఈ సినిమాల్లో దేన్ని ఆస్కార్ అవార్డ్ వరిస్తుందో చూడాలి. ఇక బెస్ట్ డైరెక్టర్ విభాగంలో…సీన్ బేకర్ – అనోరా మూవీ, బ్రాడీ కార్బెట్ – ది బ్రూటలిస్ట్, జేమ్స్ మ్యాన్‌గోల్డ్- ది కంప్లీట్ అన్‌నోన్, జాక్వెస్ ఆడియార్డ్- ఎమిలియా పెరెజ్, కోరలీ ఫార్గేట్- ది సబ్‌స్టాన్స్ మూవీ…నామినేట్ అయ్యారు. ఇక వీరిలో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అందుకుంటారో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.
ఇక బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో… సింథియా ఎరివో – విక్‌డ్ మూవీ, కార్లా సోఫియా గాస్కన్ – ఎమిలియా పెరెజ్, మికే మాడిసన్ – అనోరా, డెమి మూర్ – ది సబ్‌స్టాన్స్, ఫెర్నాండా టోర్రెస్- ఐ యామ్ స్టిల్ హియర్ మూవీ…నామినేట్ అయ్యారు. బెస్ట్ యాక్ట్స్రెస్‌గా ఎవరు ఆస్కార్ దక్కించుకుంటారో చూడాలి. ఇక బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కూడా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. అడ్రియాన్ బ్రాడీ- ది బ్రూటలిస్ట్ మూవీ, తిమోతీ చాలమెట్ – ది కంప్లీట్ అన్‌నోన్, కోల్‌మెన్ డొమినింగో- సింగ్‌సింగ్, రే ఫియన్నెస్- కాన్‌క్లేవ్, సెబాస్టియన్ స్టాన్ – ది అప్రెంటిస్..పోటీ పడుతున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి. ఈసారి హాలీవుడ్ చిత్రం ఎమిలియా పెరెజ్…అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత్ వికెడ్ మూవీ 10 విభాగాల్లో నామినేషన్లను సాధించింది.
ఆస్కార్ నామినేషన్లలో ఈ సారి ఇండియన్ చిత్రాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి. గతంలో రాజమౌళి RRR మూవీలో నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన షార్ట్ ఫిల్మ్ అనూజ… నామినేషన్స్‌లో స్థానం దక్కించుకుంది. ఈ చిత్రం బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ నామినేషన్స్‌లో నిలిచింది. భారత కాలమానం ప్రకారం మనదేశంలో మార్చి 3వ తేదీ ఉదయం 5:30 నిమిషాలకు ఈ వేడుక వీక్షించే అవకాశముంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..








