అఫీషియల్: చైతూతో శేఖర్ కమ్ముల.. హీరోయిన్ ఎవరంటే
వైవిధ్య దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటించబోతున్నాడన్న వార్తలకు తెరపడింది. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగష్టులో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఏషియన్ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటించబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల […]

వైవిధ్య దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటించబోతున్నాడన్న వార్తలకు తెరపడింది. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆగష్టులో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకోనున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఏషియన్ మూవీస్ నిర్మిస్తోన్న ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటించబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.
అయితే రెండు సంవత్సరాల క్రితం ఫిదాతో మంచి హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి వచ్చిన శేఖర్ కమ్ముల.. ఆ తరువాత కొత్త వారితో ఓ మూవీని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వలన ఆగిపోయింది. ఆ తరువాత మరో కొత్త కథను సిద్ధం చేసుకున్న శేఖర్ కమ్ముల.. దాన్ని నాగ చైతన్యకు చెప్పి ఓకే చెప్పించుకున్నాడు. మరి క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే చాలా రోజులే ఆగాలి.


