టీజర్ టాక్: కొంచెం కామెడీ.. కొంచెం సస్పెన్స్

హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో ప్రముఖ రచయిత చిన్నికృష్ణ దర్శకుడిగా మారి తీస్తున్న చిత్రం ‘అక్షర’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు. అజయ్ ఘోష్ వాయిస్‌తో మొదలైన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పాలి. ఇక టీజర్ విషయానికి వస్తే.. పేరులేని పెద్దమనిషిగా చలామణీ అవుతున్న అజయ్ ఘోష్.. టిక్ టాక్ వీడియోలు చేసే ముగ్గురు బాధ్యత లేని యువకులతో స్నేహం చేస్తాడు. ఏ బాదరా బందీ లేకుండా ఆనందంగా […]

టీజర్ టాక్: కొంచెం కామెడీ.. కొంచెం సస్పెన్స్


హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్రలో ప్రముఖ రచయిత చిన్నికృష్ణ దర్శకుడిగా మారి తీస్తున్న చిత్రం ‘అక్షర’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇవాళ విడుదల చేశారు. అజయ్ ఘోష్ వాయిస్‌తో మొదలైన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పాలి. ఇక టీజర్ విషయానికి వస్తే.. పేరులేని పెద్దమనిషిగా చలామణీ అవుతున్న అజయ్ ఘోష్.. టిక్ టాక్ వీడియోలు చేసే ముగ్గురు బాధ్యత లేని యువకులతో స్నేహం చేస్తాడు. ఏ బాదరా బందీ లేకుండా ఆనందంగా సాగిపోతున్న వారి ప్రపంచంలోకి ‘అక్షర’ అనే అందమైన టీచర్ ఎంట్రీ ఇవ్వడంతో సమస్యలు మొదలవుతాయి. దీంతో ‘అక్షర’ను చంపాలని నిర్ణయించుకుంటారు ఈ నలుగురు మిత్రులు. అసలు అక్షర ఎవరు.? ఆమె వలన వారికి ఏమి ఇబ్బందులు తలెత్తాయి.? అసలు అక్షర సాధించాలనుకున్న లక్ష్యం ఏమిటి.? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

అజయ్ ఘోష్, షకలక శంకర్, మధు, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ కామెడీ సస్పెన్స్ ఎంటర్టైనర్ ను అహితేజ బెల్లంకొండ,సురేష్ వర్మ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu