AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: వాట్సప్ వాడేవారికి మరో స్టన్నింగ్ ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఇలా సింపుల్..

వాట్సప్ ఉపయోగించేవారికి శుభవార్త. వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే.. ఇక నుంచి మెస్సేజ్‌లు షెడ్యూలింట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లలో కొంతమందికి ఈ ఫీచర్ కనిపించింది. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

WhatsApp: వాట్సప్ వాడేవారికి మరో స్టన్నింగ్ ఫీచర్.. మెస్సేజ్‌లు కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు.. ఇలా సింపుల్..
Message Schedule
Venkatrao Lella
|

Updated on: Oct 13, 2026 | 7:43 AM

Share

వాట్సప్ వాడేవారికి గుడ్ న్యూస్. ఈ సోషల్ మీడియా మెస్సేజింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. అదే మెస్సేజ్ షెడ్యూలింగ్. ఇప్పటివరకు మెస్సేజ్ పంపగానే ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకునే సౌకర్యం, డిలీట్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. కానీ మెస్సేజ్ షెడ్యూలింగ్ ఫీచర్ ప్రస్తుతం లేదు. ఇప్పుడు కొత్తగా ఎడిట్, డిలీట్ ఆప్షన్లలో పాటు మెస్సేజ్ షెడ్యూలింగ్ ఆప్షన్ కోసం వాట్సప్ కొత్తగా ప్రారంభించింది.  దీని వల్ల మర్చిపోకుండా ముందుగానే మెస్సేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి..

ప్రస్తుతం కొంతమంది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. రానున్న రోజుల్లో అందరి యూజర్ల కోసం తీసుకొచ్చే అకకాశముంది. పూర్తి అప్డేట్ రిలీజ్ చేయడంపై మరింత క్లారిటీ రావాల్సిన అవసరముంది. ఇప్పటికే వాయిస్, వీడియో కాల్స్ షెడ్యూలింగ్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఎప్పటినుంచో ఈ ఫీచర్ ఉండటంతో.. ముందుగానే కాల్స్ షెడ్యూలింగ్ చేసుకుని లింక్ సెండ్ చేయవచ్చు. దీని వల్ల అదే టైమ్‌కు అందరూ ఒకేసారి వాట్సప్‌లోకి వచ్చి వాయిస్ లేదా వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అదే తరహాలో మెస్సేజ్ షెడ్యూలింగ్ ఫీచర్ వాట్సప్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు రెండు వారాల ముందుగానే తమ మెస్సేజ్‌లను పంపడానికి షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ అప్‌డేట్.. త్వరలోనే అందరి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వినియోగదారులకు అనేక ప్రయోజనాలు

ఈ ఫీచర్ వినియోగదారులకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, వార్షికోత్సవ శుభాకాంక్షలు వంటి ప్రత్యేక సందర్భాలలో మెస్సేజ్‌లను ముందే షెడ్యూల్ చేయడం ద్వారా మర్చిపోకుండా పంపవచ్చు. అలాగే ముఖ్యమైన రిమైండర్‌లు, సమావేశాల నోటిఫికేషన్‌లు లేదా ఇతర పనికి సంబంధించిన సమాచారాన్ని నిర్ణీత సమయానికి పంపడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ ఫీచర్ ఎంతగానో దోహదపడుతుంది. వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఈ మెసేజ్ షెడ్యూలింగ్ ఫీచర్ కూడా అదే దిశలో ఒక అడుగు. ఇది వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని, నియంత్రణను అందిస్తుంది, తద్వారా వారి డిజిటల్ కమ్యూనికేషన్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ అప్‌డేట్ కోసం వాట్సాప్ వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలోనే అందరి ఫోన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ప్రస్తుత దేశంలో వాట్సప్ ఎక్కువమంది ఉపయోగిస్తున్నారు. దీంతో వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

Follow Us