AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీఎస్​ అపాచీ RTR 310 కొనేవారికి గుడ్​న్యూస్​.. ధర, కలర్​ గురించి తెలిస్తే ఫిదా

ప్రీమియం స్ట్రీట్‌ఫైటర్ బైక్‌ కొనాలనుకునేవారికి TVS Motor నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చింది. 2026 Apache RTR 310 వేరియంట్లలో మార్పులు చేస్తూ కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి తీసుకొచ్చింది. క్విక్‌షిఫ్టర్‌ ఫీచర్‌తో కూడిన కొత్త ఆప్షన్‌తో పాటు, గతంలో కొన్ని వేరియంట్లకే పరిమితమైన సెపాంగ్ బ్లూ రంగును బేస్ మోడల్‌లోనూ అందిస్తోంది.

టీవీఎస్​ అపాచీ RTR 310 కొనేవారికి గుడ్​న్యూస్​.. ధర, కలర్​ గురించి తెలిస్తే ఫిదా
Tvs Apache Rtr 310
Nikhil
|

Updated on: Oct 13, 2026 | 7:20 AM

Share

బైక్‌లో కావాల్సిన ఫీచర్లను ఎంచుకుంటూనే బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి 2026 TVS Apache RTR 310 కొత్త వేరియంట్‌ మార్పులు ఉపయోగపడవచ్చు. టాప్ వేరియంట్‌ను నిలిపివేసిన కంపెనీ, బేస్ మోడల్‌ను క్విక్‌షిఫ్టర్ ఉన్న, లేని ఆప్షన్లుగా విభజించింది. ఈ బైక్‌ ధరలు, కొత్త రంగులు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బేస్ వేరియంట్‌లో కొత్త ఆప్షన్లు..

TVS Motor తన ఫ్లాగ్‌షిప్ స్ట్రీట్‌ఫైటర్ Apache RTR 310 వేరియంట్‌ లైనప్‌లో మార్పులు చేసింది. గతంలో బేస్‌, టాప్‌, BTO డైనమిక్ కిట్‌, BTO డైనమిక్ ప్రో కిట్‌ వేరియంట్లు అందుబాటులో ఉండేవి. తాజా అప్‌డేట్‌లో టాప్ వేరియంట్‌ను నిలిపివేసి, బేస్ వేరియంట్‌ను రెండు ఆప్షన్లుగా అందిస్తోంది. ఒకటి క్విక్‌షిఫ్టర్‌ లేకుండా, మరొకటి క్విక్‌షిఫ్టర్‌తో లభిస్తుంది. BTO డైనమిక్ కిట్‌, డైనమిక్ ప్రో కిట్‌ వేరియంట్లు మాత్రం కొనసాగుతున్నాయి.

ధరల విషయానికి వస్తే.. క్విక్‌షిఫ్టర్‌ లేని బేస్ వేరియంట్‌ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌ ప్రకారం రూ.2.30 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ మోడల్‌ ఆర్సెనల్ బ్లాక్‌ రంగులో మాత్రమే లభిస్తుంది. క్విక్‌షిఫ్టర్‌తో కూడిన బేస్ వేరియంట్‌లో మరిన్ని రంగుల ఎంపికలు ఉన్నాయి. ఆర్సెనల్ బ్లాక్‌, ఫ్యూరీ ఎల్లో రంగుల ధర రూ.2.47 లక్షలు కాగా, ఫైరీ రెడ్‌ ధర రూ.2.52 లక్షలుగా ఉంది.

సెపాంగ్ బ్లూ కలర్‌..

2026 TVS Apache RTR 310లో మరో ముఖ్యమైన మార్పు సెపాంగ్ బ్లూ రంగు. గతంలో ఈ రంగు BTO వేరియంట్లకే పరిమితమైంది. ఇప్పుడు క్విక్‌షిఫ్టర్‌తో కూడిన బేస్ వేరియంట్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ రంగు ధర రూ.2.57 లక్షలుగా ఉంది. అంటే ఆర్సెనల్ బ్లాక్‌, ఫ్యూరీ ఎల్లో రంగులతో పోలిస్తే రూ.10,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రత్యేక ఎడిషన్ల విషయానికి వస్తే.. బ్లాక్ డైమండ్ ఎడిషన్‌ ధర రూ.2.49 లక్షలుగా ఉండగా, యానివర్సరీ ఎడిషన్‌ ధర రూ.2.97 లక్షలుగా ఉంది. BTO వేరియంట్ల ధరలు ఎంచుకునే కిట్‌, రంగును బట్టి మారుతాయి. అయితే ఇంజిన్‌, ప్రాథమిక పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు.

Follow Us