బాలీవుడ్‌లో రీమేక్ అవ్వబోతున్న ‘ఊసరవెల్లి’.. ప్రకటించిన ప్రముఖ నిర్మాత.. ఎన్టీఆర్ పాత్రలో అక్షయ్‌..!

బాహుబలి తరువాత టాలీవుడ్‌ స్థాయి పెరిగింది. ఒకప్పుడు ఇటువైపు పెద్దగా చూడని బాలీవుడ్‌.. ఇప్పుడు ఇక్కడి చిత్రాలపై కన్నేసింది. ఇక్కడ హిట్‌

బాలీవుడ్‌లో రీమేక్ అవ్వబోతున్న 'ఊసరవెల్లి'.. ప్రకటించిన ప్రముఖ నిర్మాత.. ఎన్టీఆర్ పాత్రలో అక్షయ్‌..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 27, 2020 | 12:54 PM

Oosaravelli Hindi remake: బాహుబలి తరువాత టాలీవుడ్‌ స్థాయి పెరిగింది. ఒకప్పుడు ఇటువైపు పెద్దగా చూడని బాలీవుడ్‌.. ఇప్పుడు ఇక్కడి చిత్రాలపై కన్నేసింది. ఇక్కడ హిట్‌ అయిన పలు చిత్రాలను అక్కడ రీమేక్‌ చేస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలే కాదు గతంలో హిట్ అయిన చిత్రాలను సైతం అక్కడ రీమేక్ చేసేందుకు నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఊసరవెల్లి చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయబోతున్నారు. (మేం కష్టపడుతుంటే.. కీర్తి ఎంత రిలాక్స్ అవుతుందో చూడండి.. ఫొటో షేర్ చేసిన నితిన్‌)

ప్రముఖ నిర్మాణ సంస్థ టిప్స్‌ ఊసరవెల్లి రీమేక్‌ హక్కులను కొనుగోలు చేసింది. అంతేకాదు ఈ రీమేక్‌కి సంబంధించి ప్రస్తుతం అక్కడ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. దీనిపై నిర్మాత కుమార్ మాట్లాడుతూ.. ఊసరవెల్లి తెలుగు వెర్షన్‌ అక్కడ మంచి విజయం సాధించింది. ఈ కథ అందరినీ కచ్చితంగా మెప్పిస్తోంది. అందుకే హిందీ ప్రేక్షకులకు ఈ రీమేక్‌ కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాము. ఊసరవెల్లిలో ఫుల్‌ కమర్షియల్‌ ఎలిమెంట్‌లు ఉన్నాయి. ఈ మూవీ అన్ని వర్గాల వారిని కచ్చితంగా ఆకట్టుకుంటుంది అని అన్నారు. (‘ఛలో ఢిల్లీ’ ఆందోళన.. రైతులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్‌లను ఉపయోగించిన పోలీసులు)

కాగా గతంలో ఈ మూవీ రీమేక్‌ హక్కుల కోసం బాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఈ రీమేక్‌లో ఆయన నటిస్తారో..? లేక మరెవరైనా నటిస్తారో చూడాలి. అయితే కామెడీ అండ్‌ మాస్ ఎంటర్‌టైనర్‌గా సురేందర్‌ రెడ్డి ఊసరవెల్లిని తెరకెక్కించారు. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించగా.. ప్రకాష్ రాజ్‌, విద్యుత్‌ జమ్మాల్‌, షామ్‌, పాయల్‌ ఘోష్‌, మురళీ శర్మ, జయ ప్రకాష్ రెడ్డి, రెహమాన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల సరసన నిలిచింది. (టాలీవుడ్‌లోకి సోనమ్‌ కపూర్‌ ఎంట్రీ.. టాప్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్‌ నటి..!)