Official: ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో బెల్లంకొండ.. ఇక్కడ పరిచయం చేసిన వినాయక్‌నే అక్కడ కూడా

ఛత్రపతి హిందీ రీమేక్‌పై ఇన్ని రోజులుగా వస్తోన్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ మూవీ రీమేక్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది

Official: 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో బెల్లంకొండ.. ఇక్కడ పరిచయం చేసిన వినాయక్‌నే అక్కడ కూడా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 27, 2020 | 1:15 PM

Chatrapathi Hindi remake: ఛత్రపతి హిందీ రీమేక్‌పై ఇన్ని రోజులుగా వస్తోన్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ మూవీ రీమేక్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ రీమేక్‌కి వివి వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఇటు వినాయక్‌, అటు బెల్లంకొండ ఇద్దరూ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్‌కి శ్రీనివాస్‌ని పరిచయం చేసిన వినాయక్‌.. ఇప్పుడు బాలీవుడ్‌కి పరిచయం చేయబోతుండటం మరో విశేషం. (బాలీవుడ్‌లో రీమేక్ అవ్వబోతున్న ఊసరవెల్లి.. ప్రకటించిన ప్రముఖ నిర్మాత.. ఎన్టీఆర్ పాత్రలో అక్షయ్‌..!

దీనిపై నిర్మాత జయంతిలాల్‌ గదా ఓ అధికారిక ప్రకటనను ఇచ్చారు. ఛత్రపతి ఒక గొప్ప స్క్రిప్ట్‌. ఇందులోని హీరో పాత్రలో బెల్లంకొండ కరెక్ట్‌గా సరిపోతాడు. ఈ ప్రాజెక్ట్‌పై మేమంతా చాలా ఉత్సాహంగా ఉన్నాము. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ మూవీని తెరకెక్కిస్తాము అని తెలిపారు. అయితే ఇప్పటికే బెల్లంకొండ నటించిన మూవీలు హిందీలో డబ్‌ అయ్యి మంచి వ్యూస్‌ని సంపాదించగా.. ఇప్పుడు డైరెక్ట్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. (మేం కష్టపడుతుంటే.. కీర్తి ఎంత రిలాక్స్ అవుతుందో చూడండి.. ఫొటో షేర్ చేసిన నితిన్‌)

కాగా 2005లో ప్రభాస్ హీరోగా రాజమౌళి ఛత్రపతిని తెరకెక్కించారు. ఇందులో శ్రియ హీరోయిన్‌గా నటించగా.. భానుప్రియ, షమీ, ప్రదీప్‌ రావత్‌, జయ ప్రకాష్‌ రెడ్డి, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ అప్పట్లో ఘన విజయం సాధించడంతో పాటు ప్రభాస్‌కి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది. ఇక వీరి కాంబినేషన్‌లోనే ఆ తరువాత ‘బాహుబలి’ తెరకెక్కి రికార్డులు సృష్టించింది. (‘ఛలో ఢిల్లీ’ ఆందోళన.. రైతులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్‌లను ఉపయోగించిన పోలీసులు)