‘ఛలో ఢిల్లీ’ ఆందోళన.. రైతులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్‌లను ఉపయోగించిన పోలీసులు
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం విధానాలపై మండిపడుతోన్న రైతులు నిరసనలు తెలిపేందుకు

Dilli Chalo Protest: రైతు చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం విధానాలపై మండిపడుతోన్న రైతులు నిరసనలు తెలిపేందుకు ఢిల్లీ బయల్దేరారు. చలిని సైతం లెక్క చేయకుండా దుప్పట్లు, రేషన్ సరుకులతో సహా ట్రాక్టర్‌లపై ప్రయాణిస్తున్నారు. మరోవైపు రైతులను అడ్డుకునేందుకు బోర్డర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. అర్ధరాత్రి సోనీపట్‌తో అన్నదాతలను అడ్డగించిన పోలీసులు వారిపై వాటర్ క్యానన్లను ప్రయోగించారు. అలాగే పలు చోట్ల 144 సెక్షన్‌ని విధించారు. తాజాగా హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్‌లను ఉపయోగించారు. ఇదిలా ఉంట ఢిల్లీలో కరోనా వైరస్ ప్రబలంగా ఉందని, పక్క రాష్ట్రాల నుంచి నిరసనకారులు ఎవరు వఛ్చినా అరెస్టులు చేస్తామని, లీగల్ యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.