జైలు మాన్యువల్ ను ఉల్లంఘించిన లాలూ .. వీఐపీ బంగళా నుంచి ఆసుపత్రి వార్డుకు తరలింపు.
లాలూప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో ఆయనను 2017 డిసెంబరు 23న జైలుకు తరలించారు.అయితే కొవిడ్ వ్యాప్తి కారణంగా లాలూను ఆసుపత్రి నుంచి రిమ్సు డైరెక్టరు బంగళాకు మార్చారు...
లాలూప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో ఆయనను 2017 డిసెంబరు 23న జైలుకు తరలించారు.అయితే కొవిడ్ వ్యాప్తి కారణంగా లాలూను ఆసుపత్రి నుంచి రిమ్సు డైరెక్టరు బంగళాకు మార్చారు. ఈ క్రమంలో లాలూప్రసాద్ యాదవ్ ఫోనులో ఎమ్మెల్యేతో మాట్లాడిన నేపథ్యంలో ఆయనను జైలు అధికారులు వీఐపీ బంగళా నుంచి ఆసుపత్రి వార్డుకు తరలించారు.
లాలూ బీజేపీ శాసనసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారని, స్పీకర్ ఎన్నికను ప్రభావితం చేసేందుకు చూశారని వచ్చిన ఆరోపణలతో ఆయనను డైరెక్టరు బంగళా నుంచి ఆసుపత్రి పేయింగ్ వార్డుకు తరలించారు. వీఐపీ బంగళాలో ఉంటూ మొబైల్ ఫోన్ వినియోగిస్తూ జైలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తేలడంతో ఆయనను ఆసుపత్రి పేయింగ్ వార్డుకు తరలించామని, అలాగే ఫోన్ కాల్ మాట్లాడటం పై దర్యాప్తు చేపట్టబోతున్నట్టు జార్ఖండ్ జైళ్లశాఖ ఐజీ బీరేంద్ర భూషణ్ తెలిపారు.