పాన్ ఇండియా క్రేజ్ కోసం ఇళయదళపతి.. బాలీవుడ్ నటులతో భారీ సినిమా !
స్టార్ హీరో ఇళయదళపతి ప్రస్తుతం మాస్టర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ నటించే ప్రతి సినిమా ఈ మధ్య వందకోట్ల వసూళ్లను అవలీలగా రాబడుతున్నాయి.
స్టార్ హీరో ఇళయదళపతి ప్రస్తుతం ‘మాస్టర్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ నటించే ప్రతి సినిమా ఈ మధ్య వందకోట్ల వసూళ్లను అవలీలగా రాబడుతున్నాయి. విజయ్ సినిమాలు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ఇక్కడ కూడా విజయ్ కు మంచి మార్కెట్ ఉంది. అయితే విజయ్ కు పాన్ ఇండియా క్రేజ్ మాత్రం లేదు. ఇప్పుడు ఈ క్రేజ్ కోసం విజయ్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
‘మాస్టర్’ సినిమాను పూర్తి చేసిన విజయ్ తర్వాతి సినిమాను నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అవుతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ను తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటీ నటులు ఉండటం వల్ల నార్త్ లో సినిమాకు మంచి మార్కెట్ వస్తుంది. అందుకోసం ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట.