మేం కష్టపడుతుంటే.. కీర్తి ఎంత రిలాక్స్ అవుతుందో చూడండి.. ఫొటో షేర్ చేసిన నితిన్‌

నితిన్‌, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్‌దే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:17 pm, Fri, 27 November 20
మేం కష్టపడుతుంటే.. కీర్తి ఎంత రిలాక్స్ అవుతుందో చూడండి.. ఫొటో షేర్ చేసిన నితిన్‌

Nithinn Keerthy Suresh: నితిన్‌, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరీ తెరకెక్కిస్తోన్న చిత్రం రంగ్‌దే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా పాటలను, కొన్ని సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. కాగా ఈ మూవీ సెట్స్ నుంచి నితిన్ తాజాగా ఓ ఫొటోను షేర్ చేసుకున్నారు. అందులో కీర్తి కళ్లపై టవల్‌ వేసుకొని నిద్రిస్తూ ఉండగా.. వెనకాల నితిన్, వెంకీ అట్లూరి ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఇక ఈ ఫొటోను షేర్ చేసుకున్న నితిన్‌.. షూటింగ్‌లో మేము చమటోర్చుతుంటే.. కీర్తి ఎంత రిలాక్స్ అవుతుందో అంటూ కామెంట్‌ పెట్టారు. ఇక ఆ ఫొటోకు కీర్తి కూడా స్పందిచారు. నీకు జలస్‌గా ఉంది కదూ అని కామెంట్ పెట్టారు. (‘ఛలో ఢిల్లీ’ ఆందోళన.. రైతులను చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ షెల్‌లను ఉపయోగించిన పోలీసులు)

కాగా రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రంగ్‌దే తెరకెక్కుతోంది. ఈ మూవీ ఇప్పటికే వచ్చిన టీజర్‌, ఒక పాట అందరినీ ఆకట్టుకోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. (టాలీవుడ్‌లోకి సోనమ్‌ కపూర్‌ ఎంట్రీ.. టాప్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్‌ నటి..!