AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrahas: నా సినిమా చూడటానికి రారేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన హీరో..

చంద్రహాస్... గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. హీరోగా తొలి చిత్రంతోనే పాపులర్ అయ్యాడు. ఫస్ట్ మూవీ వేడకలలో చంద్రహాస్ హావభావాలు చూసి నెట్టింట తెగ ట్రోల్స్ చేశారు. ఇక ఇప్పుడు గుంజి గుంజి పాటతో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. తన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ పాడిన ఈ వరస్ట్ సాంగ్ పై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అతడిపై కేసు కూడా నమోదైంది.

Chandrahas: నా సినిమా చూడటానికి రారేమో అని భయపడ్డా.. ఏడ్చేసిన హీరో..
Chandrahas
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2026 | 4:57 PM

Share

బుల్లితెరపై సీరియల్స్, షోల ద్వారా పాపులర్ అయ్యాడు ప్రభాకర్. ఇప్పటికీ స్మాల్ స్క్రీన్ పై యాక్టివ్ గా ఉంటున్నాడు. మరోవైపు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తొలి చిత్రంతోనే యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అతడు హీరోగా నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తో కలిసి సినిమా చూశాడు చంద్రహాస్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నాకు మాటలు రావడం లేదు. మూడు నెలల కిందట మ్యూజిక్ లేకుండా సినిమా చూశాను. ఆ తర్వాత ఫైనల్ కాపీ చూడలేదు. కానీ ఇప్పుడు థియేటర్లో సినిమా చూస్తుంటే చాలా బాగుంది. చివరి 10 నిమిషాలైతే నాకు ఏడుపొచ్చేసింది. థియేటర్ లో సినిమా చూస్తున్న అడియన్స్ అందరూ చివర్లో లేచి చప్పట్లు కొట్టారు. వేరే వివాదం వల్ల నా సినిమా చూడటానికి జనాలు రారేమో అని భయపడ్డాను. ఆ వివాదం నా సినిమాపై ఎఫెక్ట్ పడుతుందేమో అని భయమేసింది ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

అసలు విషయానికి వస్తే.. బరాబర్ ప్రేమిస్తా సినిమాకు సంపత్ రుద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చంద్రహాస్ హీరోగా నటించగా.. మేఘనా ముఖర్జీ కథానాయికగా నటించింది. అలాగే ఇందులో అర్జున్ మహి విలన్ పాత్రలో నటించారు. గెడా చందు, ఏవీఆర్, గాయత్రి చిన్ని ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ లో చంద్రహాస్ నటనపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. కానీ విడుదలకు నాలుగైదు రోజుల ముందు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ పాడిన గుంజి గుంజి సాంగ్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

ఈ మూవీ వేడుకలో గుంజి గుంజి అంటూ ఓ పాట పాడాడు చంద్రహాస్. అయితే ఆ పాటలో బూతు పదాలు రావడంతో అతడిపై నెటిజన్స్ మండిపడ్డారు. హీరోయ అయ్యుండి ఇలా వేదికపై అసభ్య పదాలు ఉపయోగించే పాట పాడతావా ? ప్రమోషన్ కోసం ఇంత దిగజారాలా ? అంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి. అటు ఈ సినిమా వేడుకలో పాల్గొన్న జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ తీరుపై సైతం విమర్శలు వచ్చాయి. అయితే ఈ వివాదం వల్ల సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందేమో అని చిత్రయూనిట్ భయపడ్డారట. ఇదే విషయాన్ని థియేటర్ బయట ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us