టాలీవుడ్‌లోకి సోనమ్ కపూర్ ఎంట్రీ.. టాప్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బాలీవుడ్ నటి..!
బాలీవుడ్ భామల చూపు ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. ఒకప్పుడు టాలీవుడ్‌పై పెద్దగా ఇంట్రస్ట్ చూపని.. ఈ బ్యూటీలు ఇప్పుడు అవకాశం వస్తే నటించడానికి రెడీ అవుతున్నారు

Sonam Kapoor Tollywood: బాలీవుడ్ భామల చూపు ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. ఒకప్పుడు టాలీవుడ్‌పై పెద్దగా ఇంట్రస్ట్ చూపని.. ఈ బ్యూటీలు ఇప్పుడు అవకాశం వస్తే నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే శ్రద్ధా కపూర్, సాహోతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌తో అలియా భట్ తెలుగు పరిశ్రమకు వస్తోంది. మరోవైపు ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా హీరోయిన్‌గా ఖరారు అయ్యింది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సోనమ్ కపూర్ కూడా తెలుగు పరిశ్రమకు రాబోతున్నట్లు తెలుస్తోంది. (108 రోజుల తరువాత కుటుంబాన్ని కలుసుకున్న వార్నర్.. కుమార్తెలతో స్టార్ ప్లేయర్ భావోద్వేగ క్షణాలు)
ఓ స్టార్ హీరో కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ.. సోనమ్‌తో సంప్రదింపులు జరుపుతోందట. ఈ క్రమంలో ఇప్పటికే ఆమెకు కథ వినిపించడం, ఇందులో నటించేందుకు సోనమ్ ఒప్పుకోవడం జరిగిపోయాయని తెలుస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ మూవీ ఉండనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? సోనమ్ కపూర్ ఏ స్టార్ హీరోతో నటించనున్నారు..? సోనమ్‌ని ఎవరు టాలీవుడ్‌కి పరిచయం చేయనున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సోనమ్., సెలక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. (ఈ సారి మాత్రం ‘సరిలేరు’ను బీట్ చేయలేకపోయిన ‘అల’.. మరీ అంత తక్కువ టీఆర్పీ రేటింగ్..!)