AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశం ఎప్పుడూ ఉగ్రవాదానికి తలవంచదు.. పహల్గామ్‌ ఘటన పై మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, చిరంజీవి

పహల్గామ్‌ దాడిని ఖండిస్తూ సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. ఈ ఘనత కలిచివేసిందని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వారు దీని పై రియాక్ట్ అయ్యారు.

భారతదేశం ఎప్పుడూ ఉగ్రవాదానికి తలవంచదు.. పహల్గామ్‌ ఘటన పై మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, చిరంజీవి
Maheshbabu, Vijay Devarakon
Rajeev Rayala
|

Updated on: Apr 23, 2025 | 1:43 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడితో దేశం ఒక్కసారిగా ఉల్కిపడింది. ఈ దాడిలో 30 మంది మరణించాగా సుమారు 16 మంది గాయపడినట్లు సమాచారం. ఈ దాడిలో ఉగ్రవాదులు పురుషులపై మాత్రమే దాడి చేశారు. ఉగ్రవాద దాడుల బాధితుల్లో ఎక్కువ మంది పర్యాటకులే.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కి తమ మద్దతును తెలియజేస్తున్నాయి. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ లోయలో జరిగిన మరో అతి పెద్ద దాడి ఇది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది.

ఇక ఈ ఘటన పై సినీ సెలబ్రెటీలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు స్పందించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అయ్యారు.

పహల్గాం దుర్ఘటనపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది అమాయక ప్రజలను మరియు పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైనది మరియు హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయం సానుభూతి తెలియజేస్తున్నాను. వారు అనుభవించిన నష్టాన్ని ఏదీ పూడ్చలేదు. వారి కోసం నా సంతాపం మరియు ప్రార్థనలు అని చిరంజీవి సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు.

పహల్గాం దుర్ఘటనపై ఎక్స్ లో మహేష్ బాబు పోస్ట్

ఇది చీకటి రోజు… పహల్గామ్‌లో జరిగిన దాడితో చాలా బాధపడ్డాను. ఇలాంటి క్రూరత్వానికి వ్యతిరేకంగా కలిసి నిలబడే శక్తి మనకు లభిస్తుందని ఆశిస్తున్నాను.. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు, ప్రార్థనలు బాధిత కుటుంబాలతో ఉన్నాయి అని మహేష్ బాబు అన్నారు.

పహల్గాం దుర్ఘటనపై స్పందించిన నటుడు విజయ్ దేవరకొండ

రెండు సంవత్సరాల క్రితం నేను నా పుట్టినరోజును పహల్గామ్‌లో సినిమా షూటింగ్ మధ్య జరుపుకున్నాను.. నిన్న జరిగినది ఘటన హృదయ విదారకం, కోపం తెప్పించింది. మిమ్మల్ని మీరు ఒక దళంగా చెప్పుకుని పర్యాటకులను కాల్చడం తుపాకుల వెనుక దాక్కున్న మూగ ఉగ్రవాదం యొక్క అత్యంత సిగ్గుచేటు, పిరికి చర్య. మేము బాధితులకు మరియు వారి కుటుంబాలకు అండగా నిలుస్తాము. మేము కాశ్మీర్‌కు అండగా నిలుస్తాము. త్వరలోనే ఈ పిరికివాళ్ళు నిర్మూలించబడతారని నేను ఆశిస్తున్నాను. భారతదేశం ఎప్పుడూ ఉగ్రవాదానికి తలవంచదు అని ఎక్స్ లో రాసుకొచ్చారు విజయ్.

మహేష్ బాబు

చిరంజీవి

విజయ్ దేవరకొండ

హీరో  నాని 

అల్లు అర్జున్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి