ఈ సారి మాత్రం ‘సరిలేరు’ను బీట్‌ చేయలేకపోయిన ‘అల’.. మరీ అంత తక్కువ టీఆర్పీ రేటింగ్‌..!

ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మహేష్‌, అల్లు అర్జున్‌ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే. మహేష్‌ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో

ఈ సారి మాత్రం 'సరిలేరు'ను బీట్‌ చేయలేకపోయిన 'అల'.. మరీ అంత తక్కువ టీఆర్పీ రేటింగ్‌..!
Follow us

| Edited By:

Updated on: Nov 27, 2020 | 10:20 AM

AVPL gets poor TRP: ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద మహేష్‌, అల్లు అర్జున్‌ల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిన విషయం తెలిసిందే. మహేష్‌ సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో మూవీలు ఒకరోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండింటిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా.. రెండూ మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. కానీ కలెక్షన్ల విషయంలో అల వైకుంఠపురములో ఆల్‌ టైమ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు నాన్‌ బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇలా మొత్తానికి మహేష్‌పై పైచేయి సాధించారు అల్లు అర్జున్‌. (క్షమించండి నాకు చాలా బాధగా ఉంది.. కన్నీళ్లు పెట్టుకున్న డెన్మార్క్‌ ప్రధాని.. అసలు కారణం ఏంటంటే..!)

ఇక ఆ తరువాత ఈ రెండు చిత్రాలు టెలివిజన్ ప్రీమియర్‌లోనూ పోటీ పడ్డాయి. ఉగాదికి సరిలేరు నీకెవ్వరు వరల్డ్‌ టెలివిజన్ ప్రీమియర్‌ కాగా.. ఆగష్టు 16న అల మొదటిసారిగా టెలివిజన్‌లో టెలికాస్ట్ అయ్యింది. ఈ క్రమంలో సరిలేరుకు 23.4 టీఆర్పీ రేటింగ్‌ రాగా.. అలకు 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇలా రెండోసారి కూడా బన్నీ తన స్టామినాను చూపించారు. (నాని ‘శ్యామ్ సింగ రాయ్‌’.. మరో హీరోయిన్‌కి ఛాన్స్‌.. ఆ ఇద్దరిలో నాచురల్‌ స్టార్ ఓటు ఎవరికి..!)

అయితే తాజాగా మాత్రం మహేష్‌ని బీట్ చేయలేకపోయారు బన్నీ. ఆ మధ్యన సరిలేరు రెండోసారి టెలివిజన్‌లో ప్రదర్శితం కాగా.. ఈ మధ్య అల కూడా రెండోసారి బుల్లితెరపై టెలికాస్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో మహేష్‌ మూవీకి 17.4 టీఆర్పీ రాగా.. బన్నీ చిత్రానికి మాత్రం 7.91 రేటింగ్ వచ్చింది. ఇలా ఈసారి మాత్రం మహేష్ పైచేయి సాధించారు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మూవీ అందుబాటులో ఉండటం, లోకల్ ఛానెళ్లలో రిపీట్‌గా ఈ సినిమాను వేయడం, పెద్ద సందర్భం లేకుండా ఈ సినిమాను రెండోసారి టెలికాస్ట్ చేయడంతోనే ఇంత తక్కువ టీఆర్పీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది థియేటర్‌లలో మంచి విజయం సాధించిన భీష్మకు కూడా టెలివిజన్‌లో తక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చిన విషయం తెలిసిందే. (Bigg Boss 4: ఒంటరిగా కూర్చొని ఏడ్చిన అఖిల్‌.. ఓదార్చిన అరియానా, అవినాష్‌, సొహైల్)

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..