వివాహమై 8 ఏళ్లు.. పిల్లల్ని ఎందుకు కనలేదో చెప్పిన వితిక

TV9 Telugu

03 May 2024

టాలీవుడ్‌లోని మోస్ట్ లవ్ బుల్ అండ్ రొమాంటిక్ కపుల్స్ లో వరుణ్ సందేశ్- వితికా షేరు జోడీ కూడా  ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.

 పడ్డానండీ ప్రేమలో మరి సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ లవ్ బర్డ్స్ ఈ మూవీ విడుదలైన మరుసటి ఏడాదే పెళ్లిపీటలెక్కారు

వరుణ్ సందేశ్, వితికా షేరుల వివాహం 2016లో జరిగింది. అయితే ఇప్పటివరకు ఈ జంటకు పిల్లలు లేరు. దీనికి గల కారణాన్ని ఇటీవల వెల్లడించింది వితిక.

2018లో తాను ప్రెగ్నెంట్‌ అయ్యానని,  ఆ సమయంలో తమ కుటుంబ సభ్యులందరికీ ఈ శుభవార్త చెప్పేశానంది వితికా షేరు.

అయితే దురదృష్టవశాత్తూ కొద్దిరోజుల్లోనే గర్భస్రావం అయిందని తెలిపింది వితిక. దీంతో తాను చాలా బాధపడ్డానందీ అందాల తార.

ఆ తర్వాత రెండు నెలలు పీరియడ్స్ రాకపోవడంతో మరోసారి ఆస్పత్రికి వెళ్తే ప్రెగ్నెంట్‌ అని డాక్టర్స్‌ చేప్పారని,  ఆ వార్త విని తాను షాక్‌ అయ్యానంది వితిక.

గర్భస్రావం విషయం చెప్పడంతో డాక్టర్‌ స్కానింగ్‌ చేశారని, బేబీ చిన్న ముక్క లోపలే ఉండిపోయిందని అందులో తేలిందని చెప్పుకొచ్చింది వితిక.

దీంతో మరోసారి అబార్షన్ చేసి గర్భ సంచి అంతా క్లీన్ చేశారని,  వుడు కరుణిస్తే పిల్లిలు వద్దనుకునేవాళ్లు ఎవరుంటారని వితికా ఎమోషనల్‌ అయింది.