AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరణ్‌తో నా స్నేహం… మాది విడదీయలేని బంధం: జూనియర్ ఎన్టీఆర్

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు మిత్రుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మంచి మిత్రులనే సంగతి తెలిసిందే. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ కథానాయకులిద్దరూ సోషల్ మీడియా ద్వారా తమ స్నేహాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఫొటోను జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ‘‘మెల్లగా స్నేహాన్ని ప్రారంభించండి.. కానీ స్నేహితులుగా మారాక దాన్ని నిరంతరం కొనసాగించండి’’ అన్న సోక్రటీస్ సూక్తిని పోస్ట్ […]

చరణ్‌తో నా స్నేహం... మాది విడదీయలేని బంధం: జూనియర్ ఎన్టీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 04, 2019 | 2:45 PM

Share

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు మిత్రుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ మంచి మిత్రులనే సంగతి తెలిసిందే. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ కథానాయకులిద్దరూ సోషల్ మీడియా ద్వారా తమ స్నేహాన్ని చాటుకున్నారు. రామ్ చరణ్‌తో కలిసి ఉన్న ఫొటోను జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

‘‘మెల్లగా స్నేహాన్ని ప్రారంభించండి.. కానీ స్నేహితులుగా మారాక దాన్ని నిరంతరం కొనసాగించండి’’ అన్న సోక్రటీస్ సూక్తిని పోస్ట్ చేశారు. మా స్నేహాన్ని ఇంతకు మించి మరేది నిర్వచించలేదని రామ్‌చరణ్‌తో తన స్నేహాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి #RRRYehDosti అనే హ్యాష్‌ట్యాగ్ జతచేశారు. రామ్‌చరణ్‌ కూడా ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. కొన్ని బంధాలు బలపడటానికి సమయం పడుతుంది. కానీ ఒక్కసారి బంధం ఏర్పడ్డాక జీవితాంతం కొనసాగుతాయి. అలాంటి బంధమే తారక్‌తో నాకు ఏర్పడింది. నా భీమ్ అని చరణ్ పోస్ట్ చేశాడు. ఆయన కూడా #RRRYehDosti హ్యాష్ ట్యాగ్ జత చేశారు.

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలిపింది.

https://www.instagram.com/p/B0ustTKnSaT/?utm_source=ig_web_copy_link