సుశాంత్ కేసు: అన్ని అనుమానాలకు సమాధానాలు తెలుస్తాయా..!

సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లేనా..? డిప్రెషన్‌ని తట్టుకోలేకనే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడా..?

సుశాంత్ కేసు: అన్ని అనుమానాలకు సమాధానాలు తెలుస్తాయా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 16, 2020 | 3:12 PM

Sushant Case CBI: సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లేనా..? డిప్రెషన్‌ని తట్టుకోలేకనే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడా..? సుశాంత్ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదా..? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ ఈ విషయాలపై నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా పలువురిని విచారించిన సీబీఐ అధికారులు, సుశాంత్ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని, అతనికి ఆత్మహత్య అని తేల్చినట్లు సమాచారం. అంతేకాదు పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం సీబీఐ ఈ కేసును క్లోజ్ చేసి, త్వరలోనే బీహార్ కోర్టుకు తమ రిపోర్టును ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కాగా సుశాంత్‌ మరణం తరువాత చాలా అనుమానాలు తలెత్తాయి. అతడి ఫొటోలు కొన్ని బయటకు రాగా, వాటిపై అభిమానులు ఎన్నో డౌట్లు వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటికీ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రశ్నలన్నింటికి సీబీఐ అధికారులు సమాధానాలు చెబుతారేమో చూడాలి.

కాగా జూన్ 14న సుశాంత్‌ ముంబయిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోస్ట్‌మార్టంలో సుశాంత్‌ది ఆత్మహత్యగా తేలగా.. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్య అని ఆరోపణలు చేశారు. అంతేకాదు సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు ట్రాన్స్‌ఫర్ అయినట్లు అతడి తండ్రి నటి రియా, ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ కేసులో ముంబయి పోలీసులు విచారణ సరిగా చేయలేదని, సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ బీహార్ ప్రస్తుతం కేంద్రాన్ని కోరింది. ఈ క్రమంలో సీబీఐ రంగంలోకి దిగింది. ఆ విచారణలో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో ఎన్సీబీ అధికారులు విచారణను చేసి నటి రియా, ఆమె తమ్ముడు షోవిక్‌ సహా పలువురిని అరెస్ట్ చేశారు. వారిలో రియా బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చింది. మరోవైపు ఎయిమ్స్ బృందం సైతం సుశాంత్‌ది ఆత్మహత్యగా తేల్చిన విషయం తెలిసిందే.

Read More:

సాయి పల్లవి లేదా కీర్తి సురేష్‌.. ఈ ఇద్దరిలో ఎవరు..!

వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు