సాయి పల్లవి లేదా కీర్తి సురేష్.. ఈ ఇద్దరిలో ఎవరు..!
మెగాస్టార్ చిరంజీవి తమిళ వేదాలం రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
Chiranjeevi Vedalam remake: మెగాస్టార్ చిరంజీవి తమిళ వేదాలం రీమేక్‌లో నటించనున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆచార్య మూవీ తరువాత చిరు ఇందులో నటించనుండగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే వేదాలంలో చెల్లలి పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. ఒరిజనల్‌లో ఈ పాత్రలో లక్ష్మీ మీనన్ నటించారు. ఆ పాత్రకు గానూ ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది.
ఇక తెలుగు రీమేక్‌లో ఈ పాత్ర కోసం ఇప్పుడు ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి సాయి పల్లవి, మరొకటి కీర్తి సురేష్. ఇందులో సాయి పల్లవి ఫిక్స్ అయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చినా.. మధ్యలో కీర్తి పేరు వినిపించింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరు చిరు చెల్లెలిగా నటిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నటనలో ఈ ఇద్దరు ఎవరికి వారే సాటి. ఇక ఆ పాత్రకు ఈ ఇద్దరిలో ఎవ్వరైనా న్యాయం చేయగలరు. ఇలాంటి నేపథ్యంలో చివరకు ఎవరూ చిరు చెల్లెలు పాత్రకు ఫిక్స్ అవుతారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ ఇద్దరు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Read More:
వైసీపీ ఎంపీ నందిగం సురేష్‌పై దాడి యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు
‘ఒక్కడు’, ’96’ మూవీల్లో సేమ్ సీన్లు.. వీడియో పోస్ట్ చేసిన త్రిష