జైల్లో హీరో నితిన్.. అసలు ఏమైంది..!
హీరో నితిన్ జైల్లో పడ్డారు. లాక్‌డౌన్‌లో ఓ ఇంటివాడై, ఇటీవలే తన మూవీ షూటింగ్‌లను ప్రారంభించిన ఈ హీరో.. ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతున్నారు
Nithin Check movie: హీరో నితిన్ జైల్లో పడ్డారు. లాక్‌డౌన్‌లో ఓ ఇంటివాడై, ఇటీవలే తన మూవీ షూటింగ్‌లను ప్రారంభించిన ఈ హీరో.. ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఏంటి..? నితిన్ ఏంటి..? జైలు ఏంటి..? అనుకుంటున్నారా..! అక్కడికే వస్తున్నాము. వైవిధ్య దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ చెక్ మూవీలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
లాక్‌డౌన్ సడలింపుల తరువాత ఒక్కో మూవీ సెట్స్ మీదకు వెళుతుండగా.. ఇప్పుడు చెక్ కూడా షూటింగ్‌ని తిరిగి ప్రారంభించింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నితిన్‌కి చెందిన ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది. అందులో నితిన్ ఖైదీగా జైల్లో ఉండగా.. లాక్‌డౌన్ టు లాకప్ అని కామెంట్ పెట్టారు. కాగా ఇందులో నితిన్ ఖైదీగా కనిపించనుండగా.. రకుల్ లాయర్‌గా నటిస్తున్నారు. ఇక ఈ మూవీని భవ్య క్రియేషన్స్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
కాగా ఈ మూవీతో పాటు నితిన్.. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో రంగ్‌దే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌లో విజయం సాధించిన అంధధూన్ తెలుగు రీమేక్‌లో నితిన్, ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా, నబా నటేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.
Read More:
సుశాంత్ మరణం: నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. త్వరలోనే కేసు క్లోజ్!
సాయి పల్లవి లేదా కీర్తి సురేష్.. ఈ ఇద్దరిలో ఎవరు..!
New schedule beginsss!! ?? @yeletics @BhavyaCreations @Rakulpreet #priyavarrier pic.twitter.com/nPQnGcowdW
— nithiin (@actor_nithiin) October 16, 2020