బాలీవుడ్ సింగర్ కుమార్ సానుకు కరోనా పాజిటివ్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను(63) కరోనా వైరస్ బారిన పడ్డారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కుమార్ సాను(63) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా గురువారం రాత్రి వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తు నాకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దయచేసి నా ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థించండి. థ్యాంక్యూ మై టీమ్’ అంటూ పోస్ట్ చేశారు. కాగా ఈ నెల 20న సాను పుట్టినరోజు జరుపుకోనున్నారు. లాస్ ఏంజెల్స్‌లో కుటుంబంతో సరదాగా బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ కు ప్రిఫేర్ అయ్యారు. ఇందుకోసం అక్టోబర్ 14న అక్కడకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇంతలో ఆయన కొవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సరిగా లేనందున నవంబర్‌కు వాయిదా వేసుకున్నారు.
ఇక, కుమార్ సాను 1990లో బాలీవుడ్‌లో అద్భుత పాటలను అలపించారు. బీబీసీ టాప్ 40 బాలీవుడ్ సౌండ్‌ట్రాక్స్‌లో కుమార్ పాటలు దాదాపు 25 ఉన్నాయి. అతను 30 భాషల్లో 21 వేల పాటలను పాడి రికార్డు సృష్టించారు. అంతేగాక కేవలం ఒకే రోజులో 28 పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కుమార్ సాను కుమారుడు జాన్ బిగ్‌బాస్ 14లో కంటెస్టెంటుగా పాల్గొంటున్నారు. ఒక్క హిందీలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులను సొంతం చేసుకున్నారు. మరోవైపు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.