కాంగ్రెస్‌పార్టీ మునిగే నౌక: ఖుష్బూ విమర్శలు

భారతీయ జనతాపార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్‌పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు నటి ఖుష్బూ.. కాంగ్రెస్‌ పార్టీ టైటానిక్‌ లాంటిందని తెలిసి కూడా సేవా దృక్పథంతో ఆ పార్టీతో నాలుగేళ్లపాటు ప్రయాణించానని తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. తమిళనాడు కాంగ్రెస్‌ గ్రూపుల మయమంటూ విమర్శించారు. ఆ పార్టీలోని నేతలకు ప్రజల శ్రేయస్సు ఏ మాత్రం పట్టదని తెలిపారు. పార్టీని బలోపేతం చేద్దామన్న ధ్యాసే లేదని ఖుష్బూ అన్నారు. ఏదో ప్రయోజనం ఆశించే తాను […]

కాంగ్రెస్‌పార్టీ మునిగే నౌక:  ఖుష్బూ విమర్శలు
Follow us
Balu

|

Updated on: Oct 16, 2020 | 12:31 PM

భారతీయ జనతాపార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్‌పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు నటి ఖుష్బూ.. కాంగ్రెస్‌ పార్టీ టైటానిక్‌ లాంటిందని తెలిసి కూడా సేవా దృక్పథంతో ఆ పార్టీతో నాలుగేళ్లపాటు ప్రయాణించానని తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. తమిళనాడు కాంగ్రెస్‌ గ్రూపుల మయమంటూ విమర్శించారు. ఆ పార్టీలోని నేతలకు ప్రజల శ్రేయస్సు ఏ మాత్రం పట్టదని తెలిపారు. పార్టీని బలోపేతం చేద్దామన్న ధ్యాసే లేదని ఖుష్బూ అన్నారు. ఏదో ప్రయోజనం ఆశించే తాను బీజేపీలో చేరినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని, వారిని చూస్తే జాలి వేస్తుందని పేర్కొన్నారు. నాలుగేళ్ల విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని, నేతలందరి ఉద్దేశం కూడా అదేనని చెప్పారు. తన రాజకీయ వ్యవహారాలలో భర్త సి.సుందర్‌ జోక్యం చేసుకుంటారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. కన్యాకుమారి నుంచి పోటీ చేస్తున్నానన్నది కూడా అసత్య ప్రచారమేనని, అక్కడ ఇదివరకే బలమైన నేత పొన్‌ రాధాకృష్ణన్‌ ఉన్న సంగతి మర్చిపోతే ఎలా అని అన్నారు ఖుష్బూ..