‘కేజీఎఫ్‌ 2’ సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే!

దక్షిణాదిన భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రాల్లో 'కేజీఎఫ్ 2' ఒకటి. యశ్ హీరోగా నటిస్తోన్న ఈ సీక్వెల్‌కు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.

'కేజీఎఫ్‌ 2' సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 04, 2020 | 7:19 PM

KGF 2 shooting update: దక్షిణాదిన భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న చిత్రాల్లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. యశ్ హీరోగా నటిస్తోన్న ఈ సీక్వెల్‌కు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ మొదలైన సమయానికే ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి, మిగిలిన పనులు చూసుకోవాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు దర్శకుడు ప్లాన్ చేశారట.

శాండిల్‌వుడ్‌ సమాచారం ప్రకారం ఆగష్టు 15 నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నారట. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్‌ను చేసేందుకు టీమ్‌ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాగా అక్టోబర్‌ 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ముందుగా భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి ‘కేజీఎఫ్‌ 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాక్‌. ఇక ఈ సీక్వెల్‌లో సంజయ్ దత్‌ విలన్‌గా కనిపించనుండగా.. రవీనా టాండెన్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read This Story Also: గుడ్‌న్యూస్‌.. కరోనాకు గోరు వెచ్చని నీటితో ‘చెక్‌’