నవిష్కతో స్టెప్పులేసిన రామ్ చరణ్

కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో సినిమా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైపోయింది. ఆ ఖాళీ సమయాన్ని మాత్రం నటులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...........

నవిష్కతో స్టెప్పులేసిన రామ్ చరణ్

Ramchan Dance with His Nephew Navishka : కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో సినిమా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైపోయింది. ఆ ఖాళీ సమయాన్ని మాత్రం నటులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.

రామ్ చరణ్ చెల్లి శ్రీజ కుమార్తె నవిష్కతో కాసేపు సందడిగా గడిపారు. నవిష్కతో పాటు టీవీ చూస్తూ.. డాన్సులు చేశారు రామ్ చరణ్. పనిలో పనిగా తన కోడలికి కూడా డాన్సులో స్టెప్పులు నేర్పించారు. మామను చూస్తూ చప్పట్లు కొడుతూ బుజ్జి అడుగులు వేసింది. నవిష్క బుజ్జి స్టెప్పులు చూసి తెగ మురిసిపోయాడు మెగా వారసుడు.

అదే వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియోకు ‘డ్యాన్స్ ఆఫ్ విత్ దిస్ డార్లింగ్’ అనే క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ గా మారుతోంది. గతంలోనూ నవిష్కతో కలిసి చిరంజీవి సందడి చేసిన సంగతి
తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ ఆర్ఆర్’ లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో కథానాయకుడు. కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా చిత్రీకరణ వాయిదా పడింది.

Click on your DTH Provider to Add TV9 Telugu