అధిక ఫీజులు వసూలు.. మూడు కార్పొరేట్‌ ఆసుపత్రులకు కోవిడ్‌ సేవలు కట్‌

కరోనా వేళ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

అధిక ఫీజులు వసూలు.. మూడు కార్పొరేట్‌ ఆసుపత్రులకు కోవిడ్‌ సేవలు కట్‌
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2020 | 9:07 PM

Telangana Government notices to hospitals: కరోనా వేళ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా మరో మూడు కార్పొరేట్ ఆసుపత్రులకు కరోనా సేవలను కట్‌ చేసింది. అలాగే హైదరాబాద్‌లో కరోనా ట్రీట్‌మెంట్‌ చేస్తోన్న మరికొన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. కాగా ఐసీయూలో రోగికి రోజుకి రూ.10వేలు తీసుకోవాలని ప్రభుత్వం రూల్‌ పెట్టింది. కానీ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు రోజుకు రూ.లక్ష నుంచి రూ.2లక్షలు గుంజుతున్నారు. దీనికి సంబంధించి వైద్యశాఖ వాట్సాప్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా కార్పొరేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. తప్పు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాగా అధిక ఫీజు ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే దక్కన్‌ ఆసుపత్రిలో కరోనా వైద్యం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు విరంచి, గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రిపై చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: ‘కేజీఎఫ్‌ 2’ సెట్స్‌పైకి వెళ్లేది ఎప్పుడంటే!