యూపీలో లక్ష మార్క్ దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. వేలల్లో నమోదైన కేసుల సంఖ్య లక్షలకు చేరుకుంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటేసింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,948 మంది కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపుకుని మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 1,00,310 చేరినట్టు యూపీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
దేశంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కొత్త కేసులు వెలుగుచూస్తునే ఉన్నాయి. వేలల్లో నమోదైన కేసుల సంఖ్య లక్షలకు చేరుకుంటుంది. ఉత్తర ప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ దాటేసింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,948 మంది కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఇవాళ నమోదైన కొత్త కేసులతో కలిపుకుని మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 1,00,310 చేరినట్టు యూపీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మహమ్మారి కాటుకు ఇవాళ మరో 41 మంది ప్రాణాలొదిలారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,817కి చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు 57,271 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 41,222 మందితో యాక్టివ్ కేసులు ఉన్నట్టు అదనపు ముఖ్య కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో లక్నోలో అత్యధికంగా 611 వరకు ఉండగా.. కాన్పూర్‌లో 259 మంది ఉన్నట్టు ఆయన తెలిపారు.