తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్

తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కరోనా ప్రభావం పడింది. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో...

తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్

Corona Effect on Telangana BJP Office : తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కరోనా ప్రభావం పడింది. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణియంచారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నారు.

సోమవారం వరకు రాష్ట్ర కార్యాలయంలోకి నేతలు, కార్యకర్తలతో పాటు మరెవరినీ అనుమతించ కూడదని నిర్ణయించారు. అయితే కొత్త కార్యవర్గాన్ని నియమించినా.. ఆ నేతలు కార్యాలయానికి రావొద్దని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కరోనా నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయంలోకి పరిమిత సంఖ్యలో కార్యాలయం సిబ్బందిని అనుమతిస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu