గుడ్‌న్యూస్.. కరోనాకు గోరు వెచ్చని నీటితో ‘చెక్’
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు దాదాపు 160కి పైగా పరిశోధనా బృందాలు శ్రమిస్తున్నాయి.
Boiling Water for corona: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు చెక్ పెట్టేందుకు శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కునేందుకు దాదాపు 160కి పైగా పరిశోధనా బృందాలు శ్రమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ వైరస్‌ని అంతం చేసే అద్భుతమైన ఔషధమేమీ లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ పిడుగులాంటి వ్యాఖ్య చేసింది. ఇదంతా పక్కనపెడితే దీనిపై విస్తృతంగా అధ్యయనం చేస్తోన్న రష్యన్ శాస్త్రవేత్తలు ఓ గుడ్‌న్యూస్‌ని చెప్పారు. సాధారణ గది ఉష్ణోగ్రత లేదా గోరువెచ్చని నీరు తాగితే కరోనా వైరస్ నాశనం అవుతుందని వారు తెలిపారు.
సైబీరియాలోని నోవోసిబిర్క్స్‌లోని రష్యా వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీకి చెందిన ఓ పరిశోధానా బృందం ఈ విషయాన్ని కనుగొన్నట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది. గది ఉష్ణోగ్రత కలిగిన నీరు కరోనాకు కారణమయ్యే సార్స్ సీఓవీ-2 వైరస్ పెరుగుదలను ఆపగలదని తెలిపారు. గది ఉష్ణోగ్రత కలిగిన నీరు 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్‌కు చెందిన 90 శాతం కణాలను చంపగలదని, అదే 72 గంటల్లో 99.9 శాతం కణాలను నాశనం చేస్తుందని వివరించారు. ఇక మరుగుతున్న నీరు నావెల్ కరోనా వైరస్‌ను పూర్తిగా, వెంటనే చంపగలదని వారు గుర్తించారు. వీటితో పాటు కరోనా వైరస్ క్లోరినేటెడ్ నీరు, సముద్రపు నీటిలో జీవించగలిగినప్పటికీ, తన సంతతిని పెంచుకోవడం లేదని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
Read This Story Also: సింగర్ స్మితకు కరోనా పాజిటివ్