వితంతువుకు అపన్నహస్తం అందించిన సోనూసూద్
ఎక్కడ ఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తున్నాడు. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు సోనూ సూద్. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సాయం కావాలని ఎవరైనా కోరితే వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా రక్షా బంధన్ సందర్భంగా ఈ రియల్ హీరో ఓ వితంతువుకు సాయం చేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు.
ఎక్కడ ఆపద ఉన్నా క్షణాల్లో సాయం చేసేందుకు ముందుకొస్తున్నాడు. కష్టం అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు సోనూ సూద్. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఎందరికో సాయం చేస్తూ రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సాయం కావాలని ఎవరైనా కోరితే వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా రక్షా బంధన్ సందర్భంగా ఈ రియల్ హీరో ఓ వితంతువుకు సాయం చేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు. అస్సాంలోని జల్‌పైగురిలో వరదల కారణంగా ఓ మహిళ పూరి గుడిసె పూర్తిగా ధ్వంసమైంది. ఆమెకు తోడుగా నిలిచేందుకు కుటుంబసభ్యలు వెంట రాకపోవడంతో.. పిల్లలు తినడానికి కూడా తిండి లేని దీన స్థితిలో ఉన్నారు. ఇందుకు సంబంధించి దెబ్బతిన్న గుడిసెను వీడియో తీసి దాన్ని సోనాల్ సింఘ్ అనే మహిళ ట్విటర్‌లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్పందించిన సోనూ సూద్ మరోసారి మనసున్న మహా మనిషిగా నిరూపించుకున్నారు. ఆమెకు రాఖీ పండుగరోజు వరాన్ని ప్రసాదించారు. కొత్త ఇంటిని కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో సోనూపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
चलो आज रक्षा बंधन के अवसर पर असम में अपनी इस बहन का नया घर बनाते हैं। ❣️ https://t.co/ZyqgJKHQXb
— sonu sood (@SonuSood) August 3, 2020