తమిళనాడులో మరణమృదంగం.. ఒక్క రోజే 108 మంది మృతి

తమిళనాడులో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. కేవలం ఒకే రోజు 108 మంది చనిపోయినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 4,349 మంది మృతి...

తమిళనాడులో మరణమృదంగం.. ఒక్క రోజే 108 మంది మృతి

తమిళనాడులో కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. కేవలం ఒకే రోజు 108 మంది చనిపోయినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 4,349 మంది మృతి చెందినట్టు పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 5,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,68,285కి చేరింది. ఇందులో తమిళనాడు రాజధాని నగరం చెన్నైలోనే అధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 5603 కొవిడ్ కేసుల్లో 1,023 మంది చెన్నై నగరంలోనే నమోదు కావడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు. వీరితో చెన్నైలో 1,04,027 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది,

గడిచిన కొద్ది రోజులుగా నిత్యం ఐదు నుంచి ఆరు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కఠినంగా లాక్‌డౌన్ విధిస్తున్న సంగతి తెలిసిందే.

Click on your DTH Provider to Add TV9 Telugu