అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే
జబర్దస్త్ అప్పారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అప్పారావు. పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకున్నాడు జబర్దస్త్ అప్పారావు. ఒక ఇంటర్వ్యూలో శకలక శంకర్‌తో తన అనుబంధం, ఆయన కెరీర్, వ్యక్తిగత నమ్మకాలపై అనేక కీలక విషయాలను వెల్లడించారు

ప్రముఖ హాస్యనటి నెల్లూరు నీరజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో రకరకాల వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోలతో పాటు జబర్దస్త్ లోనూ పలు స్కిట్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నీరజ. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో.. జబర్దస్త్ కామెడీ షోలో తన అనుభవాలను, ఎదురైన సవాళ్లను వెల్లడించారు. టీమ్ లీడర్‌గా ఆమె ప్రవేశించినప్పుడు కొందరు వ్యతిరేకించారని, ఆమెను అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. గెటప్ శీను తనను బ్లాక్ చేశాడని, చంద్ర కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడని తెలిపారు. అయితే, రాఘవ మాత్రం తనకు పూర్తి మద్దతు ఇచ్చారని, తన స్కిట్ల నుండి స్ఫూర్తి పొంది అనేక స్కిట్లు చేశానని చెప్పారని నీరజ గుర్తు చేసుకున్నారు. జబర్దస్త్ కు ముందు, గ్నాపిక ఎంటర్టైన్మెంట్స్ తనకు ఐదు సంవత్సరాల పాటు జీవనోపాధి కల్పించిందని, తన కెరీర్‌ను ప్రారంభించిందని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు
జబర్దస్త్ లోకి వచ్చాక, స్కిట్ల కోసం కొత్త లైన్లు కనుగొనడం కష్టమని, పదే పదే కొత్తదనం తీసుకురావడం పెద్ద సవాలని ఒక టీమ్ లీడర్‌గా తన అనుభవాలను పంచుకున్నారు. తన టీమ్ సభ్యులు, ముఖ్యంగా సుబ్బు, శ్రీనులను కావాలనే దూరం పెట్టారని నీరజ ఆవేదన వ్యక్తం చేశారు. నరేష్ విషయంలో, ఆయన చాలా కమర్షియల్ వ్యక్తి అని, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తాడని భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని నీరజ ప్రస్తావించారు. నరేష్ తనతో వ్యక్తిగతంగా బాగానే ఉన్నప్పటికీ, టీమ్ విషయానికి వస్తే సమస్యలు ఎదురయ్యాయని నీరజ తెలిపారు. ఒక ఎపిసోడ్‌కు తన టీమ్‌కు 40,000 నుండి 50,000 రూపాయలు పేమెంట్ వచ్చేదని, అయితే ఇందులో రైటర్‌కు 10,000 రూపాయలు, అలాగే కో-యాక్టర్స్‌కు కూడా తామే ఇవ్వాల్సి వచ్చేదని నీరజ వివరించారు. అన్నీ పోను కేవలం 5,000 నుండి 6,000 రూపాయలు మాత్రమే మిగిలేవని, ఇది ఆర్థికంగా సరిపోయేది కాదు అని ఆమె తెలిపారు.
ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్
క్రమంగా టీమ్ నుండి తన సభ్యులను తొలగించడం, తన స్కిట్లను సరిగా రిసీవ్ చేసుకోకపోవడం, విమర్శలు పెరగడం వంటి కారణాలతో షో నుండి బయటకొచ్చినట్లు నీరజ వెల్లడించారు. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తనను పిలిచారని, సమస్య ఏమిటని అడిగారని తెలిపారు. అయితే, తన టీమ్‌లో సుబ్బును కూడా తిరిగి తీసుకుంటేనే వస్తానని షరతు పెట్టగా, దానికి అంగీకరించలేదని నీరజ చెప్పారు. రాకేష్ అనే వ్యక్తి కూడా కమిటీ కుర్రాళ్ళు సినిమా షూటింగ్లో భాగంగా తన టీమ్‌లోకి రమ్మని అడగగా, సుబ్బుకు అవకాశం ఇస్తేనే వస్తానని చెప్పినట్లు తెలిపారు. తనతో పాటు తన టీమ్‌లోని మంచి నటుడైన సుబ్బును దూరం పెట్టడానికి గల కారణాలు తనకు అర్థం కాలేదని, ఇది కేవలం టీమ్ రాజకీయమని భావించి తాను జబర్దస్త్ ప్లాట్‌ఫారమ్‌కు దూరంగా ఉన్నానని నెల్లూరు నీరజ స్పష్టం చేశారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి మాత్రం పలుమార్లు గెస్ట్‌గా వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు.
నా ఇన్ స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




