Nayanthara: ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లు.. నయనతార ఆస్తులు ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
తమిళంతోపాటు తెలుగులోనూ వరుస విజయాలను అందుకుందీ బ్యూటీ. అటు కోలీవుడ్‌తో పాటు, ఇటు టాలీవుడ్‌లోనూ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ చిన్నది. వివాహం తర్వాత కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ, భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. మొన్నటి మొన్న జవాన్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో కూడా నటించి మెప్పించిందీ చిన్నది...

నయనతార.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోందీ బ్యూటీ. 2003లో వచ్చిన మనసునక్కరే అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నయన్.. 2005లో వచ్చిన గజిని చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకపోయింది.
తమిళంతోపాటు తెలుగులోనూ వరుస విజయాలను అందుకుందీ బ్యూటీ. అటు కోలీవుడ్‌తో పాటు, ఇటు టాలీవుడ్‌లోనూ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ చిన్నది. వివాహం తర్వాత కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ, భారీ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. మొన్నటి మొన్న జవాన్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో కూడా నటించి మెప్పించిందీ చిన్నది. ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న నయన్ రెమ్యునరేషన్‌తో పాటు, తన బ్యాంక్ బ్యాలెన్స్‌ను కూడా పెంచుకుంటూ పోతోంది.
నవంబర్ 18 (శనివారం)వ తేదీతో నయన తార 39వ పడిలోకి అడుగుపెడుతోన్న నేపథ్యంలో నయనతారకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి.? ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.? లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నయనతార చివరగా నటించిన చిత్రం జవాన్‌కు ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 183 కోట్లు అని ఓ అంచనా.
ఇక నయనతార ఆస్తుల విషయానికొస్తే.. ఈ బ్యూటీకి హైదరాబాద్‌లో రెండు ప్రీమియం అపార్ట్‌మెంట్స్ ఉన్నట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంట్స్‌లో ప్రీమియం 5 స్టార్ హోటల్‌లోని సూట్‌లకు సమానమైన ఇంటీరియర్‌తో రూపొందించినవి వార్తలు వచ్చాయి. హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన బంజారిహిల్స్‌లో ఈ రెండు అపార్ట్‌మెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అపార్ట్‌మెంట్ మార్కెట్ విలువ రూ. 15 కోట్ల వరకు ఉండొచ్చని ఓ అంచనా. ఇక నయన్‌కు కేరళలో ఆమెకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కూడా ఉంది. అలాగే చెన్నైలో విలాసవంతమైన ఇల్లు నయన్‌కు ఉంది. దీని విలువ అక్షరాల రూ. 100 కోట్లు అని అంచనా.
View this post on Instagram
ఇక ఒకేసారి రెండుకు మించి సినిమాల్లో నటించే సమయంలో తన బిజీ షెడ్యూల్‌ను నిర్వహించుకోవడానికి నయనతార కొన్నేళ్ల క్రితం.. ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. సౌత్ ఇండియాలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రామ్ చరణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలకు మాత్రమే ఇలాంటి ప్రైవేట్ జెట్స్ ఉన్నట్లు సమాచారం. ఇక కేవలం సినిమాలే కాకుండా వ్యాపారంలోనూ అడుగుపెట్టింది నయన. 2019లో ది లిప్ బామ్ అనే కంపెనీని ప్రారంభించింది. అలాగే 2023లో 9స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే శానిటరీ నాప్‌కిన్ బ్రాండ్ ఫెమీ9లో కూడా నయన్ పెట్టుబడి పెట్టింది.
View this post on Instagram
నయన తార వ్యాపారం ఇంతటితో ఆగలేదు.. 2021లో భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి తమ సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌ని ప్రారంభించారు. ఈ ప్రొడక్షన్ బ్యానర్‌లో కూజాంగల్ (2021), నేత్రికన్ (2021), కాతువాకుల రెండు కాదల్ (2022) వంటి సినిమాలను తెరకెక్కించారు. ఇక నయన తార కార్ల కలెక్షన్ కూడా పెద్దదేనని చెప్పాలి. నయన్ గ్యారేజీలో.. రూ. 74.5 లక్షల విలువైన బీఎమ్‌డబ్ల్యూ, రూ. 88 లక్షల విలువైన మెర్సిడెస్ జీఎల్‌ఎస్ 350డీ కార్లు ఉన్నాయి. వీటితో పాటు రూ. 1.76 కోట్ల ధర కలిగిన BMW 7-సిరీస్ వంటి హై-ఎండ్ కారు ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..